ఎఫ్‌బీ యూజర్లకు మరో షాక్.. డార్క్ వెబ్‌లో అమ్మకాలు జరిగాయట!
ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ డౌన్ అవ్వడంతో షాక్ గురైన యూజర్లకు రష్యన్ ప్రైవసీ అఫైర్స్ మరో షాకిచ్చింది. ఫేస్‌బుక్ గ్లోబల్ నెట్‌వర్క్స్ అంతరాయం కల్గిన సమయంలో హ్యకర్లు డార్క్ వెబ్ హ్యాకర్ ఫోరమ్‌లో ఫేస్‌బుక్ యూజర్ల డేటాను విక్రయించారని నివేదించింది. ఫేస్‌బుక్ యూజర్ల చిరునామా, పేరు, ఈ-మెయిల్ చిరునామా, ఫోన్ నంబర్లను అమ్మకానికి ఉంచినట్లు తెలుస్తోంది.
ఒక నివేదిక ప్రకారం దాదాపు 1.5 బిలియన్ ఫేస్‌బుక్ ఖాతాలు డార్క్ వెబ్‌లో అమ్మకానికి వచ్చినట్లు రష్యన్ ప్రైవసీ అఫైర్స్ నివేదించింది. కొంతమంది హ్యాకర్లు ఫేస్‌బుక్ వినియోగదారుల డేటాను కొనుగోలు చేయడానికి ప్రయత్నించినట్లు నిర్ధారణలు ఉన్నాయని పేర్కొంది.
కాగా.. నిన్న ఒక్కసారిగా ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ డౌన్ అవ్వడంతో ప్రపంచవ్యాప్తంగా అనేక మంది యూజర్లు షాక్ గురయ్యారు. ఏడుగంటల పాటు ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ నెట్‌వర్క్ పూర్తిగా నిలిచిపోయింది.