ఫేస్‌బుక్‌కు షాకిచ్చిన బ్రిటన్ : రూ.515 కోట్ల భారీ అపరాధం
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌కు బ్రిటన్ దేశం తేరుకోలేని షాకిచ్చింది. అడిగిన వివరాలను అందించకుండా జాప్యం చేస్తూ నిర్లక్షపూరితంగా వ్యవహరించినందుకు 515 కోట్ల రూపాయల (70 మిలియన్ డాలర్లు) జరిమానాను బ్రిటన్ కాంపిటీషన్ రెగ్యులేటర్ విధించింది.
బ్రిటన్‌కు చెందిన ప్రముఖ యానిమేటెడ్ సంస్థ జిఫిని ఫేస్‌బుక్ కొనుగోలు చేసింది. ఈ కోనుగోలు తర్వాత ఫేస్‌బుక్‌పై అనేక ఆరోపణలు వచ్చాయి. సోషల్ మీడియా మధ్య పోటీని ఫేస్‌బుక్ నియంత్రిస్తోందని ఆరోపణలు వచ్చాయి.
దీనిపై బ్రిటన్ కాంపిటీషన్ అండ్ మార్కెట్స్ అథారిటీ విచారణ చేపట్టింది. అయితే, ఫేస్‌బుక్ ఈ విచారణను తేలిగ్గా తీసుకుంది. సీఎంఏ అడిగిన వివరాలను అందించకుండా ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేస్తూ వచ్చింది.
దీంతో సీఎంఏ ఫేస్‌బుక్‌కు భారీ జరిమానా విధించింది. ఎవరైనా సరే నిబంధనలను పాటించాల్సిందే అని స్పష్టం చేసింది. దీనిపై స్పందించిన ఫేస్‌బుక్ సీఎంఏ నిర్ణయాన్ని సమీక్షించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని తెలియజేసింది.