గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ivr
Last Modified: శనివారం, 15 ఏప్రియల్ 2017 (12:46 IST)

రెడ్ ఐఫోన్ రూ.4000 కట్... లిమిటెడ్ పీరియడ్ ఆఫర్

ఫోన్ మార్కెట్ విపరీతంగా పెరిగిపోయింది. దీనికి కారణం వేరే చెప్పక్కర్లేదు. అటు రిలయన్స్ jio, ఇటువైపు ఎయిర్ టెల్, వొడాఫోన్, ఐడియా... తదితర కంపెనీలు వాయిస్ కాల్స్, ఇంటర్నెట్ సౌకర్యాన్ని కారుచౌకగా ఇస్తుండటంతో ఇపుడంతా స్మార్ట్ ఫోన్లను కొనేందుకు ఎగబడుతున్నా

ఫోన్ మార్కెట్ విపరీతంగా పెరిగిపోయింది. దీనికి కారణం వేరే చెప్పక్కర్లేదు. అటు రిలయన్స్ jio, ఇటువైపు ఎయిర్ టెల్, వొడాఫోన్, ఐడియా... తదితర కంపెనీలు వాయిస్ కాల్స్, ఇంటర్నెట్ సౌకర్యాన్ని కారుచౌకగా ఇస్తుండటంతో ఇపుడంతా స్మార్ట్ ఫోన్లను కొనేందుకు ఎగబడుతున్నారు. 
 
ఈ నేపధ్యంలో ఫోన్ కంపెనీలు కూడా తమవంతు ఆకర్షణ మొదలెట్టేశాయి. సమ్మర్ సేల్ సందర్భంగా ఫోన్ల ధరల్లో డస్కౌంట్ ఇస్తున్నాయి. తాజాగా రెడ్ స్పెషన్ ఎడిషన్ ఐ ఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్ ఫోన్లను అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ల ద్వారా కొనుగోలు చేసేవారికి రూ. 4000 మేర డిస్కౌంట్ ప్రకటించారు. ఐతే ఇది పరిమిత కాలం వరకు మాత్రమే వర్తిస్తుందని వెల్లడించారు.
 
కాగా ఈ ఫోన్లు ఎరుపు రంగులో చూసేందుకు ఆకర్షణీయంగా వున్నాయి. 128 జీబీ, 256 జీబీ అంతర్గత మెమొరీ సామర్థ్యం కలిగిన ఈ ఫోన్ల ధరలు 4 వేలు తగ్గించగా వరుసగా రూ. 66,000 మరియు రూ. 78,000గా వున్నాయి.