వాయిస్ మెసేజ్‌లను టెక్ట్స్ మెసేజ్‌లు మార్చే టెక్నాలజీ... వాట్సాప్ నయా ఫీచర్!
ప్రముఖ సోషల్ మెసేజింగ్ వాయిస్ వాట్సాప్ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి వస్తే నిరక్ష్యరాస్యుడు సైతం వాట్సాప్‌లో టెక్ట్స్ మెసేజ్ పంపొచ్చు. ఈ న్యూ ఫీచర్ ద్వారా వాయిస్ నోట్‌లను టెక్ట్స్ రూపంలోకి మార్చడం సాధ్యపడుతుంది. స్పీచ్ రికగ్నిషన్ టెక్నాలజీని ఉపయోగించి వాయిస్ మెసేజ్‌లను టెక్ట్స్ రూపంలోకి మార్చుతారు.
వాయిస్ మెసేజ్‌లను వినే పరిస్థితి లేనపుడు ఆ మెసేజ్‍లను సందేశాల రూపంలో చదువుకునేందుకు ఈ ఫీచర్ ఎంతగానో ఉపయోగపడనుంది. ప్రస్తుతానికి ఐఫోన్ యూజర్లకు ఈ ఫీచర్‌ను బీటా వెర్షన్ రూపంలో అందుబాటులోకి తీసుకొచ్చింది. అతి త్వరలోనే ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా ప్రయోగాత్మకంగా అందించనున్నారు. వినికిడి లోపం ఉన్నవారు, నిరక్ష్యరాస్యులకు ఈ ఫీచర్ ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుందని వాట్సాప్ భావిస్తుంది.