జియోనీ ఫోన్లలో జియో సిమ్‌లు వాడితే.. 4జీ డేటా ఫ్రీ..

మొబైల్స్ తయారీ సంస్థ జియోనీ రిలయన్స్.. పలు ఆఫర్లను అందిస్తోంది. ప్రస్తుతం జియోనీ ఫోన్లలో జియో సిమ్‌లను వాడుతున్న వినియోగదారులు రూ.309 ఆపైన ప్యాక్‌లను రీచార్జి చేసుకుంటే దాంతో వారికి ఉచితంగా 4జీ డేటా ల

Selvi| Last Updated: మంగళవారం, 27 జూన్ 2017 (19:23 IST)
మొబైల్స్ తయారీ సంస్థ జియోనీ రిలయన్స్.. పలు ఆఫర్లను అందిస్తోంది. ప్రస్తుతం జియోనీ ఫోన్లలో జియో సిమ్‌లను వాడుతున్న వినియోగదారులు రూ.309 ఆపైన ప్యాక్‌లను రీచార్జి చేసుకుంటే దాంతో వారికి ఉచితంగా 4జీ డేటా లభిస్తోంది. ఇక కొత్తగా జియోనీ ఎ1 లేదా పీ7 మ్యాక్స్ ఫోన్లను కొనే వారికి రూ.250 విలువ గల పేటీఎం వాలెట్ వోచర్లను జియోనీ అందిస్తోంది.

ఈ నేపథ్యంలో జియో, పేటీఎం సంస్థలతో భాగస్వామ్యం ద్వారా యూజర్లకు ఆఫర్లను ముందుకు తెచ్చింది. ఇందులో భాగంగా.. జియోనీ పీ5ఎల్, పీ7 ఫోన్లను వాడుతున్న వారికి 2జీబీ 4జీ డేటా లభిస్తుండగా, ఇలైఫ్ ఎస్6, ఇలైఫ్ ఎస్7, ఎస్ ప్లస్, ఎస్6ఎస్, మారథాన్ ఎం4, మారథాన్ ఎం5 లైట్, మారథాన్ ఎం5, ఎఫ్103 ప్రొ, ఎం5 లైట్ సీడీఎంఏ, పీ7 మ్యాక్స్, ఎఫ్103 ఫోన్లను వాడుతున్న వారికి 5జీబీ 4జీ డేటా, ఎ1, ఎం5 ప్లస్, ఎస్6 ప్రొ, ఇలైఫ్ ఇ8 ఫోన్లను వాడుతున్న వారికి 10 జీబీ 4జీ డేటా ఉచితంగా లభిస్తుందని వెల్లడించింది. అయితే ఈ ఫోన్లను వాడుతున్న వారు మార్చి 31, 2018 వరకు గరిష్టంగా 6 సార్లు రీచార్జి చేసుకోవచ్చునని సంస్థ పేర్కొంది.దీనిపై మరింత చదవండి :