ఫేక్ ఫోన్ కాల్స్‌కు చెక్... Truecaller యాప్

స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగిస్తున్న వినియోగదారులు ఎవ్వరూ Truecaller యాప్ గురించి తెలియకుండా ఉండరు. ఈ రోజుల్లో మొబైల్‌ డిస్‌ప్లేపై గుర్తు తెలియని నంబర్‌ కనిపించిందంటే వినియోగదారులు ట్రూకాలర్‌ యాప్‌ను ఆశ్రయించడం ఎంతగానో పెరిగింది. భారత్‌లో Truecaller యాప్ చ

mobile phone
Bindu| Last Modified సోమవారం, 5 జూన్ 2017 (15:04 IST)
స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగిస్తున్న వినియోగదారులు ఎవ్వరూ Truecaller యాప్ గురించి తెలియకుండా ఉండరు. ఈ రోజుల్లో మొబైల్‌ డిస్‌ప్లేపై గుర్తు తెలియని నంబర్‌ కనిపించిందంటే వినియోగదారులు ట్రూకాలర్‌ యాప్‌ను ఆశ్రయించడం ఎంతగానో పెరిగింది. భారత్‌లో Truecaller యాప్ చాలా వేగంగా దూసుకుపోతోంది. ఈ కమ్యూనికేషన్‌ యాప్‌కు ఇటీవల భారత్‌లో విశేష ఆదరణ లభిస్తోంది. ఎంతలా అంటే గూగుల్‌ ప్లేస్టోర్‌లో అత్యధిక డౌన్‌లోడ్‌లు చేసుకుంటోన్న నాలుగవ అతిపెద్దగా యాప్‌గా ట్రు‌కాలర్ నిలిచింది.

స్వీడెన్‌కు చెందిన ఓ ప్రముఖ కంపెనీ ఈ యాప్‌ను తయారుచేసింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది వినియోగదారులు ఈ యాప్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ ఆండ్రాయిడ్ అప్లికేషన్, గతంలో గుర్తించబడిన లక్షల మొబైల్ నెంబర్లకు సంబంధించిన డేటాబేస్‌ను కలిగి ఉంది. కాబట్టి, ఈ యాప్ ద్వారా కొత్త మొబైల్ నెంబర్లతో వచ్చే ఫోన్ కాల్స్‌ను దాదాపుగా ట్రేస్ చేయవచ్చు. మొబైల్ నెంబర్ ఎవరి పేరు మీద ఉందో తెలుసుకునేందుకు యాప్ ఉపయోగపడుతుంది. గుర్తు తెలియని నెంబర్‌ల నుంచి వచ్చే మొబైల్ కాల్స్‌ను ట్రేస్ చేయటంలో ఈ యాప్ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ యాప్ ద్వారా గుర్తు తెలియని కాంటాక్ట్ నెంబర్‌కు సంబంధించి అడ్రస్‌తో సహా పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

మ్యారీ మీకర్ ఇంటర్నెట్ ట్రెండ్స్ 2017 రిపోర్ట్స్ ప్రకారం గూగుల్ ప్లే స్టోర్ నుంచి అత్యధికంగా డౌన్‌లోడ్ చేసుకుంటున్న యాప్స్ జాబితాలో మొదటి ప్లేస్‌ను వాట్సాప్ కైవసం చేసుకోగా, రెండవ స్థానంలో మెసెంజర్ మూడవ స్థానంలో షేరిట్ యాప్స్ నిలిచాయి. ఫేస్‌బుక్ యాప్‌ను కూడా ట్రు‌కాలర్ బీట్ చేయటం విశేషం. అలాగే, యాప్‌లో ప్రకటనదారులకు రోజుకు లక్ష క్లిక్‌లను ట్రూకాలర్‌ అందిస్తుందని మేరీ మీకర్‌ ఇంటర్‌నెట్‌ ట్రెండ్స్‌ వెల్లడించింది.దీనిపై మరింత చదవండి :