శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 11 జులై 2020 (17:13 IST)

టిక్ టాక్ మాదిరిగానే.. పాప్-ఇన్ యాప్‌కు నెటిజన్లు ఫిదా

చైనా యాప్‌లు నిషేధానికి గురైన నేపథ్యంలో భారత యాప్‌లకు డిమాండ్ పెరిగింది. టిక్‌టాక్‌ రద్దవడంతో నెటిజన్లు ​అయోమయంలో పడ్డారు. టిక్‌టాక్‌కు ప్రత్యామ్నాయంగా ఉండే వేరే యాప్‌ల కోసం జల్లెడ వేసి వెతుకున్నారు. ఇందులో భాగంగా అచ్చం టిక్‌టాక్‌ను మాదిరిగానే ఐ మీడియా అండ్‌ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ పూర్తి స్వదేశీ యాప్‌ ''పాప్‌-ఇన్"ను రూపొందిస్తోంది.
 
అధునాతన స్వదేశీ పరిజ్ఞానంతో, వినూత్నమైన ఎన్నో ఫీచర్స్‌తో తయారవుతోంది. అత్యంత సులభతరంగా ప్రతి ఒక్కరు ఉపయోగించుకునేలా పాప్‌-ఇన్‌‌ను రూపొందిస్తున్నామని ఆ యాప్ నిర్వాహకులు చెప్తున్నారు. 
 
పాప్‌-ఇన్‌ పూర్తి స్వదేశీ యాప్‌ అని, ఇది ప్రపంచానికి మనదేశ సత్తాచాటుందని ధీమా వ్యక్తం చేశారు. దేశ భవిష్యత్తు స్వదేశీ యాప్‌లపైనే ఆధారపడివుందని, యావత్ ప్రపంచం మన దేశ యాప్‌లను వినియోగించుకునేందుకు ఇష్టపడతారని ఆ యాప్ కంపెనీ ప్రతినిధి ఫణి రాఘవ తెలిపారు.