శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 22 ఆగస్టు 2017 (09:51 IST)

జియోకు ధీటుగా ఎయిర్ టెల్ 4జీ స్మార్ట్ ఫీచర్ ఫోన్.. ధర రూ.2,500..?

జియోను దెబ్బ తీసేందుకు ఎయిర్ టెల్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా జియో మార్కెట్లోకి తెచ్చిన ఉచిత ఫీచర్ ఫోన్‌కు పోటీగా రూ.2,500 ధరలో ఎయిర్ టెల్ సరికొత్త స్మార్ట్ ఫోన్‌ను అందుబాటులోకి తేనుంది. ఇందుకో

జియోను దెబ్బ తీసేందుకు ఎయిర్ టెల్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా జియో మార్కెట్లోకి తెచ్చిన ఉచిత ఫీచర్ ఫోన్‌కు పోటీగా రూ.2,500 ధరలో ఎయిర్ టెల్ సరికొత్త స్మార్ట్ ఫోన్‌ను అందుబాటులోకి తేనుంది. ఇందుకోసం మొబైల్ ఫోన్ తయారీ సంస్థలతో ఎయిర్‌టెల్ జరుపుతున్న చర్చలు ఫలించాయని సమాచారం.

అధిక మొత్తంలో డేటాతో పాటు వాయిస్ మినిట్స్ ఇస్తూ.. ఆ ఫోనును ఫీచర్ ఫోనుతో పోలిస్తే మెరుగైన ఆప్షన్లతో కొత్త ఫోను తీసుకువస్తున్నట్లు ఎయిర్ టెల్  వర్గాల సమాచారం. 
 
ఈ ఫోను దసరా, దీపావళి పండగ సీజన్లో మార్కెట్లో రావచ్చునని తెలిసింది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో అన్ని రకాల యాప్స్‌ను వాడుకోదగిన ఈ ఫోను.. జియో ఫీచర్ ఫోన్‌తో పోలిస్తే మెరుగైన స్క్రీన్, మంచి కెమెరా, అధిక బ్యాటరీ సామర్థ్యం కలిగివుంటుంది. ఇప్పటికే ఎయిర్ టెల్ తమతో చర్చలు జరిపిన మాట వాస్తవమేనని లావా, కార్బన్ సంస్థలు ప్రకటించాయి. కానీ డీల్ కుదిరిందా..? లేదా అనేది ఎయిర్ టెల్ సంస్థ అధికారికంగా ప్రకటించాల్సి వుంది.