శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 26 సెప్టెంబరు 2016 (12:24 IST)

4జీ క్రేజ్.. లెనోవో నుంచి మోటో జెడ్, మోటో ఫోర్స్, మోటో జెడ్ ప్లే రిలీజ్...

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 4జీ సేవల కోసం.. మొబైల్ ఫోన్స్ వాడకం పెరిగిపోతోంది. ఇందుకు తోడుగా మొబైల్స్ తయారీ సంస్థలు స్మార్ట్ ఫోన్లను విడుదల చేసేందుకు పోటీపడుతున్నాయి. చైనీస్ దిగ్గజ మొబైల్ ఉత్పత్తుల సం

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 4జీ సేవల కోసం.. మొబైల్ ఫోన్స్ వాడకం పెరిగిపోతోంది. ఇందుకు తోడుగా మొబైల్స్ తయారీ సంస్థలు స్మార్ట్ ఫోన్లను విడుదల చేసేందుకు పోటీపడుతున్నాయి. చైనీస్ దిగ్గజ మొబైల్ ఉత్పత్తుల సంస్థ లెనోవో తన మోటో సిరీస్‌లో పాపులర్ అయిన మోటో జెడ్, మోటో ఫోర్స్, మోటో జెడ్ ప్లే స్మార్ట్‌ఫోన్లను త్వరలోనే భారత మార్కెట్లో విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ మొబైల్ ఫోన్‌ను దసరాకు భారత మార్కెట్లో రిలీజ్ చేయనున్నారు. మోటో జెడ్ స్మార్ట్‌ఫోన్‌ ఇప్పటికే యూకే, యూఎస్‌లోని దేశాలలో లభ్యమవుతోంది.
 
ఆండ్రాయిడ్ 6.0.1 మార్ష్‌మాలో ఆపరేటింగ్ సిస్టమ్ కలిగిన మోటో జెడ్, 5.5 అంగుళాల టచ్ స్క్రీన్, 720x1280 రెసల్యూషన్‌ కలిగివుంటుంది. ఇంకా.. 2.2 గిగాహెడ్జ్ ప్రాసెసర్, 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 13 మెగాపిక్సెల్ వెనక కెమెరా, 4 జీబి ర్యామ్, 32 జీబి అంతర్గత స్టోరేజ్ సామర్థ్యం కలిగివుంటుంది. 2600mAh బ్యాటరీ సామర్థ్యంతో 4జీని సపోర్ట్ చేస్తుంది.