శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 1 మార్చి 2022 (12:51 IST)

మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యనాదెళ్లకు పుత్రశోకం

మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యనాదెళ్ల పుత్రశోకం కలిగింది. సత్యనాదెళ్ల కుమారుడు జైన్‌ నాదెళ్ల (26) ప్రాణాలు కోల్పోయారు. పుట్టుకతోనే సెరిబ్రల్‌ పక్షవాతంతో బాధపడుతున్న జైన్‌ .. సోమవారం తీవ్ర అనారోగ్యానికి గురై మరణించినట్లు ఆ సంస్థ తెలిపింది.  
 
ఈ విషయాన్ని మైక్రోసాఫ్ట్‌ సంస్థ తన ఎగ్జిక్యూటివ్‌ సిబ్బందికి ఈ-మెయిల్‌ ద్వారా వెల్లడించింది. అలాగే జైన్‌ మృతికి సంతాపం ప్రకటించింది. సత్య నాదెళ్ల, అను దంపతుల పెద్ద కుమారుడు జైన్‌ 1996లో జన్మించాడు. అయితే జైన్‌ తీవ్రమైన సెరెబ్రల్‌ పాల్సీ లక్షణాలతో పుట్టినట్లు వైద్యులు గుర్తించారు. 
 
అప్పటి నుంచి అతడు వీల్‌ ఛెయిర్‌కే పరిమితమయ్యారు. దీంతో 2014లో మైక్రోసాఫ్ట్‌ సిఇఒగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి సత్య నాదెళ్ల విభిన్న ప్రతిభావంతుల కోసం వినూత్న పరికరాలను రూపొందించడంపై దృష్టిపెట్టారు.