భారత్‌లోనే 5జీ టెక్నాలజీ పరికరాలు.. నోకియా ప్రకటన
నోకియా కీలక విషయాన్ని తెలిపింది. భారత్‌లోనే 5జీ టెక్నాలజీ పరికరాలను తయారు చేయడం ప్రారంభించినట్లు పేర్కొంది. వీటిని ఇప్పటికే 5జీ వినియోగానికి శరవేగంగా ఏర్పాటు చేస్తున్న దేశాలకు తరలిస్తున్నట్లు పేర్కొంది. భారత్‌లో 5జీ న్యూ రేడియో తయారు చేసిన సంస్థగా నోకియా నిలిచింది. తాజాగా నోకియా ఎయిర్‌స్కేల్ మాసివ్ మల్టిపుల్ ఇన్‌పుట్ మల్టిపుల్ ఔట్‌పుట్ (ఎంఐఎంవో) పరికరాలు కూడా సిద్ధం చేసినట్లు కంపెనీ పేర్కొంది.
మరోవైపు భారత్‌లో 5జీ సర్వీసుకు టెలికమ్ ఆపరేటర్లకు అవసరమైన స్పెక్ట్రమ్‌ను వేలం వేయాల్సి ఉంది. కాగా భారత్‌లో తొలి 5జీ ఎన్ఆర్ తయారీ సంస్థ మాదేనని నోకియా సీనియర్ వైస్‌ప్రెసిడెంట్, భారతీయ మార్కెటింగ్ విభాగం హెడ్ సంజయ్ మాలిక్ తెలిపారు.
అత్యుత్తమ స్థాయి పరికరాల తయారీలో భారత్ శక్తిని వెల్లడించాయి. భారతీయ టెలికమ్ ఆపరేట్లర్లు 5జీ సేవలు అందించడానికి ఇవి సహకరిస్తాయి. నోకియా చెన్నై ఫ్యాక్టరీ అత్యాధునిక 5జీ మాసీవ్ ఎంఐఎంవో పరికరాలు తయారు చేసి ఎగుమతి చేస్తోంది. 2008 నుంచి ఆ ప్లాంట్‌లో దాదాపు 50 లక్షల టెలికం పరికరాలను తయారు చేశాం. వీటిని దాదాపు 100 దేశాలకు ఎగుమతి చేశామని మాలిక్ చెప్పుకొచ్చారు.