గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డివి
Last Modified: శుక్రవారం, 27 నవంబరు 2020 (19:03 IST)

శ్రీశ్రీశ్రీ ఫిలిం ప్రొడక్షన్స్ బ్యానర్ పైన ప్రొడక్షన్ నంబర్ 1 చిత్రం పూజ కార్యక్రమాలతో ప్రారంభం

అనిల్, జాస్మిన్ జంటగా గోపాల్ రెడ్డి కాచిడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ శ్రీశ్రీశ్రీ ఫిలిం ప్రొడక్షన్స్ బ్యానర్ పైన టిఎమ్ఎస్ ఆచార్య నిర్మిస్తున్న చిత్రం శుక్రవారం హైదరాబాద్ లోని సంస్థ కార్యాలయంలో వైభవంగా ప్రారంభమైంది. హీరోహీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత, సంతోషం పత్రిక అధినేత సురేష్ కొండేటి క్లాప్ కొట్టారు. ఆధ్యాత్మిక గురువు హరి ప్రసాద్ కెమెరా స్విచ్ ఆన్ చేసారు.
 
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో చిత్ర నిర్మాత టిఎమ్ఎస్ ఆచార్య మాట్లాడుతూ, ఈ రోజు మా శ్రీ శ్రీ శ్రీ ఫిలిం  ప్రొడక్షన్స్ బ్యానర్ పైన ప్రొడక్షన్ నంబర్ 1 సినిమా పూజ కార్యక్రమాలతో ప్రారంభిస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఇది మా మొదటి సినిమా, తప్పకుండా మీ అందరి సహాయసహకారాలు ఉంటాయని కోరుకుంటున్నాను. మంచి ఆసక్తికర కథతో దర్శకుడు గోపాల్ రెడీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. నిర్మాతగా ఇది మా మొదటి ప్రయత్నం తప్పకుండా మీ అందరి సహకారం, ప్రోత్సహం ఉంటుందని కోరుకుంటున్నాను అన్నారు.  
 
దర్శకుడు గోపాల్ రెడ్డి కాచిడి మాట్లాడుతూ, ఈ రోజు పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభిస్తున్నాం, ఈ నెల 30 నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టి ఏకధాటిగా షూటింగ్ జరిపి సినిమాను పూర్తి చేస్తాం. ఇది సైకో థ్రిల్లర్. ఆసక్తికరమైన మలుపులతో సస్పెన్స్ థ్రిల్లర్‌గా కొత్త అనుభూతి కలిగించేలా ఉంటుంది. ఈ సినిమాతో అనిల్‌ని హీరోగా పరిచయం చేస్తున్నాం. అలాగే హీరోయిన్ జాస్మిన్‌కి ఇది రెండో సినిమా, మోడల్‌గా ఉన్న ఈ అమ్మాయి ఈ సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా మంచి ఇమేజ్ తెచ్చుకుంటుందన్న నమ్మకం ఉంది, ఈ సందర్బంగా క్లాప్ కొట్టి మమ్మల్ని ఆశీర్వదించాడు వచ్చిన సురేష్ కొండేటి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మా టీం అందరికి కూడా నా థాంక్స్ తెలుపుకుంటున్నాను అన్నారు.
 
హీరో అనిల్ మాట్లాడుతూ, ఈ సినిమా ప్రారంభోత్సవానికి విచ్చేసిన సురేష్ కొండేటి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకు ఈ సినిమాలో హీరోగా అవకాశం ఇచ్చిన నిర్మాత, దర్శకులకు థాంక్స్ చెబుతున్నాను. ఇది సరికొత్త సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఉంటుంది. కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. తప్పకుండా మంచి విజయం సాధిస్తుంది అన్న నమ్మకం ఉంది అన్నారు.
 
హీరోయిన్ సబీనా జాస్మిన్ మాట్లాడుతూ, తెలుగులో ఇది నా రెండో సినిమా. నేను మోడల్‌గా ఉంది సినిమాల్లోకి రావడం జరిగింది. ఈ ప్రొడక్షన్లో సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. సైకో నేపథ్యంలో సాగే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ఇది. ఈ సినిమాలో అవకాశం రావడానికి కారణం అయిన పటేల్ నండుర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఈ సినిమాకు నన్ను హీరోయిన్‌గా ఎంచుకున్న దర్శకుడు గోపాల్ రెడ్డి గారికి, నిర్మాతకు థాంక్స్ చెబుతున్నాను అన్నారు.      
నటీనటులు: అనిల్, జాస్మిన్
బ్యానర్: శ్రీ శ్రీ శ్రీ ఫిలిం ప్రొడక్షన్స్
నిర్మాత: టిఎమ్ఎస్ ఆచార్య
దర్శకత్వం: గోపాల్ రెడ్డి కాచిడి
కథ, స్క్రీన్ ప్లే: పటేల్ నండుర్క
సంగీతం: గౌర హరి
కెమెరా: సీతా రామాంజనేయులు ఉప్పతల
ఎడిటింగ్: భాస్కర్
పబ్లిసిటీ డిజైనర్: విక్రమ్