శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: సోమవారం, 12 అక్టోబరు 2020 (22:13 IST)

ఒకప్పుడు నో చెప్పిన డైరెక్టర్‌కి రామ్ ఇప్పుడు ఓకే చెప్పాడా..?

ఎనర్జిటిక్ హీరో రామ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించి.. మాస్‌లో మాంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత రామ్ రెడ్ మూవీ చేసారు. ఈ చిత్రానికి నేను శైలజ ఫేమ్ కిషోర్ తిరుమల దర్శకత్వం వహించారు. అయితే.. ఈ సినిమా రిలీజ్‌కి రెడీగా ఉంది. ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్టు వార్తలు వచ్చాయి కానీ.. థియేటర్లోనే రిలీజ్ చేయనున్నారు.
 
ఈ సినిమా తర్వాత రామ్ నెక్ట్స్ మూవీ ఎవరితో ఉంటుంది అనేది ఆసక్తిగా మారింది. స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో రామ్ సినిమా పక్కా అనుకున్నారు కానీ.. ప్రాజెక్ట్ సెట్ కాలేదు.
 
 ఎవరితో సినిమా చేస్తాడా అనుకుంటే... సక్సస్‌ఫుల్ అండ్ సెన్సేషనల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి పేరు వినిపిస్తుంది. గతంలో అనిల్ రావిపూడి రాజా ది గ్రేట్ మూవీని రామ్‌తో చేయాలి అనుకున్నారు కానీ.. లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అయ్యింది.
 
ఇప్పుడు రామ్‌తో అనిల్ రావిపూడి మూవీ సెట్ అయ్యిందని టాలీవుడ్లో టాక్ వినిపిస్తుంది. వీరిద్దరి మధ్య ఈ సినిమాకి సంబంధించి కథా చర్చలు జరిగాయని తెలిసింది. ఈ సినిమాని స్రవంతి మూవీస్ బ్యానర్ పైన స్రవంతి రవికిషోర్ నిర్మించనున్నట్టు సమాచారం.