గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 11 మార్చి 2021 (16:53 IST)

ఒప్పో నుంచి ఎఫ్19 ప్రొ సిరీస్‌లో రెండు కొత్త ఫోన్లు

Oppo
స్మార్ట్‌ఫోన్‌ మేకర్‌ ఒప్పో సోమవారం ఎఫ్19 ప్రొ సిరీస్‌లో రెండు కొత్త ఫోన్లను ఇటీవల భారత్‌లో విడుదల చేసింది. amzn.to/3kUo9ae లింక్‌ ద్వారా అమెజాన్‌లో ఫోన్లను ముందుగా బుకింగ్‌ చేసుకోవచ్చు.

ప్రీ ఆర్డర్లపై హెచ్‌డీఎఫ్‌సీ, కొటక్‌ బ్యాంకులు ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్లు అందిస్తున్నాయి. క్వాడ్‌ రియర్‌ కెమెరాలు, సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేలతో రూపొందించిన F19 ప్రొ + 5G, F19 ప్రొ మోడళ్లను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది.
 
8GB ర్యామ్‌ + 128GB స్టోరేజ్‌ వేరియంట్‌ కలిగిన F19 ప్రొ ధర రూ.21,490 కాగా, 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజ్‌ మోడల్‌ ధర రూ.23,490గా నిర్ణయించారు. అలాగే 8GB ర్యామ్‌+128GB స్టోరేజ్‌ వేరియంట్‌ కలిగిన F19 ప్రొ + ఫోన్‌ ధర రూ.25,990గా ఉంది.