ఒప్పో: మార్చి 17 నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్లు.. 5జీ కనెక్టివిటీ & స్పెసిఫికేషన్స్
ఒప్పో నుంచి కొత్త ఫోన్ భారత మార్కెట్లోకి విడుదల అయ్యింది. చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ ఒప్పో మరో రెండు ఫ్లాగ్‌షిప్ ఫోన్లను భారత్‌లో సోమవారం ఆవిష్కరించింది. కొత్త ఒప్పో ఎఫ్19 ప్రొ సిరీస్ ఫోన్లు క్వాడ్ రియర్ కెమెరా, అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తోంది.
రెండు మోడళ్లు కూడా ఆండ్రాయిడ్ 11 ఆధారంగా పనిచేస్తాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 800యు వస్తోన్న ఎఫ్19 ప్రొ+ 5జీ కనెక్టివిటీని సపోర్ట్ చేస్తుంది. మీడియాటెక్ హీలియో పి95తో విడుదలైన ఎఫ్19 ప్రొ 4జీ టెక్నాలజీని సపోర్ట్ చేస్తుంది. భారత్‌లో 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ఒప్పో ఎఫ్ 19ప్రొ+ ధర రూ.25,990గా నిర్ణయించారు.
8 జీబి ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ కలిగిన ఒప్పో ఎఫ్ 19 ప్రొ ధర రూ. 21,490గా ఉంది. ఎఫ్ 19 ప్రొలో 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.23,490గా నిర్ణయించారు. ఒప్పో ఫోన్లు ఫ్లూయిడ్ బ్లాక్, స్పేస్ సిల్వర్ కలర్లలో అందుబాటులో ఉన్నాయి. మార్చి 17 నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ల సేల్ ఆరంభంకానుంది.
స్పెసిఫికేషన్స్ :
డిస్ ప్లే - 6.4 ఇంచ్‌ల ఎఫ్‌హెచ్‌డి ప్లస్ అమోల్డ్ డిస్ ప్లే. 20.9 ఆస్పెక్ట్ రేటియో, 408 పిక్సెల్ డెన్సిటీ
ప్రాసెసర్ - మీడియో టెక్ హీలియో పీ95
రామ్ - 8జీబీ ప్లస్ 128 జీబీ, 8జీబీ ప్లస్ 256 జీబీ
రియర్ కెమెరా- 48ఎంపీ ప్లస్ 8 ఎంపీ ప్లస్ 2ఎంపీ ప్లస్ 2ఎంపీ
ఫ్రంట్ కెమెరా - 16 ఎంపీ ఎఫ్/2.0 సెన్సార్
బ్యాటరీ : 4,310 ఎంఏహెచ్ బ్యాటరీ
ఆండ్రాయిడ్ 11 బేస్డ్ కలర్ ఓఎస్
ఫింగర్ ప్రింట్ స్కానర్
4జీ వోల్ట్, డుయెల్ సిమ్, వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్బీ టైప్