ఒప్పో నుంచి కొత్త ఫోన్లు.. హీట్ కాకుండా వుండేందుకు..?
భారత్‌లో ఒప్పో సంస్థ ఒప్పో ఫైండ్ ఎక్స్2, ఎక్స్2 ప్రొ పేరిట రెండు కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లు విడుదల కానున్నాయి. ఈ ఫోన్లలో 5జి సపోర్ట్‌ను అందిస్తున్నారు. గేమ్స్ ఆడేటప్పుడు, వీడియోలు చూసేటప్పుడు, ఇంటర్నెట్ బ్రౌజ్ చేసేటప్పుడు ఫోన్ ఎక్కువగా హీట్ అవకుండా ఉండేందుకు గాను వీటిలో ప్రత్యేకంగా లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీని ఏర్పాటు చేశారు.
ఈ ఫోన్లలో వెనుక భాగంలో 48 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉంది. ఫైండ్ ఎక్స్2 వెనుక భాగంలో ఆ 48 మెగాపిక్సల్ కెమెరాకు తోడు 12 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 13 మెగాపిక్సల్ టెలిఫొటో కెమెరాలను ఏర్పాటు చేశారు.
ఒప్పో ఫైండ్ ఎక్స్2, ఎక్స్2 ప్రొ ఫీచర్లు
6.7 ఇంచుల క్వాడ్ హెచ్‌డీ ప్లస్ ఓలెడ్ డిస్‌ప్లే
ఈ డిస్‌ప్లే 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది.
ముందు భాగంలో 32 మెగాపిక్సల్ పంచ్ హోల్ కెమెరా
స్నాప్‌డ్రాగన్ 865 అధునాతన ప్రాసెసర్
ఫైండ్ ఎక్స్2 వెనుక భాగంలో ఆ 48 మెగాపిక్సల్ కెమెరాకు తోడు 12 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా,
13 మెగాపిక్సల్ టెలిఫొటో కెమెరాలను ఏర్పాటు చేశారు.
అదే ఫైండ్ ఎక్స్2 ప్రొలో వెనుక భాగంలో 48 మెగాపిక్సల్ కెమెరాతోపాటు మరో 48 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 13 మెగాపిక్సల్ టెలిఫొటో కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇక ఫైండ్ ఎక్స్2 ఫోన్ కెమెరాలతో 5ఎక్స్ హైబ్రిడ్ జూమ్, 20 ఎక్స్ డిజిటల్ జూమ్ లభిస్తుంది. అదే ఫైండ్ ఎక్స్2 ప్రొ ఫోన్ కెమెరాలతో అయితే 10ఎక్స్ హైబ్రిడ్ జూమ్, 60ఎక్స్ డిజిటల్ జూమ్ లభిస్తుంది.