శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Updated : మంగళవారం, 16 జూన్ 2020 (23:11 IST)

భారత్ - చైనా ఉద్రిక్తతలు: 20 మంది భారత సైనికులు వీరమరణం

భారత-చైనా సరిహద్దు ఉద్రిక్తత తీవ్రతరం కావడంతో, సోమవారం రాత్రి తూర్పు లడఖ్‌లోని సున్నితమైన గాల్వన్ లోయలో చైనా దళాలతో హింసాత్మక ముఖాముఖి పోరులో కనీసం 20 మంది భారతీయ సైనికులు అమరులయ్యారని భారత సైన్యం తెలిపింది.
 
జూన్ 15 నుంచి 16 రాత్రి అంతకుముందు ఘర్షణ పడిన గాల్వన్ ప్రాంతంలో భారత- చైనా దళాలు విడిపోయాయి. స్టాండ్-ఆఫ్ ప్రదేశంలో విధి నిర్వహణలో 17 మంది భారత దళాలు తీవ్రంగా గాయపడ్డారని భారత సైన్యం తెలిపింది.
 
ఎత్తైన భూభాగంలోని సున్నా డిగ్రీల ఉష్ణోగ్రతలలో తీవ్ర గాయాలకు గురైనవారిలో 20 మంది అమరులయ్యారని సైన్యం తెలిపింది. దేశం యొక్క ప్రాదేశిక సమగ్రతను మరియు సార్వభౌమత్వాన్ని కాపాడటానికి భారత సైన్యం కట్టుబడి ఉందని భారత సైన్యం పేర్కొంది.
 
మంగళవారం ఉదయం, తూర్పు లడఖ్‌లోని సున్నితమైన గాల్వన్ లోయలో సోమవారం రాత్రి చైనా దళాలతో హింసాత్మక ఘర్షణలో భారత ఆర్మీ అధికారి, ఇద్దరు సైనికులు మరణించినట్లు సైన్యం ధృవీకరించింది.
 
సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద భారతదేశం తన బాధ్యతాయుతమైన విధానాన్ని అనుసరిస్తోందనీ, తన కార్యకలాపాలన్నీ ఎల్‌ఐసికి లోబడే వున్నట్లు స్పష్టం చేసింది. చైనా కూడా దానిని అతిక్రమించరాదని, దానినే తాము చైనా నుంచి ఆశిస్తున్నట్లు వెల్లడించారు.
 
హింసాత్మక ముఖాముఖిలో ఇరువర్గాలు ప్రాణనష్టానికి గురయ్యాయని, గాల్వన్ లోయలోని వాస్తవ నియంత్రణ రేఖను (ఎల్‌ఐసి) గౌరవించటానికి చైనా వైపు నుంచి సానుకూల స్పందన రావాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ ముందు రోజు చెప్పారు. కాగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తూర్పు లడఖ్‌లో జరిగిన పరిణామాలపై రెండు సమీక్షా సమావేశాలు నిర్వహించారు.