గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 26 మే 2021 (18:06 IST)

సోషల్ మీడియాలో అర్కూట్‌కు సంబంధించిన మీమ్స్ వైరల్

Orkut
నూతన ఐటీ నిబంధనలు అమలులోకి వచ్చిన నేపథ్యంలో సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్ ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌లపై కేంద్రం నిషేధం విధిస్తుందన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో నెటిజన్లు గతంలో మంచి రోజులను గుర్తు చేసుకుంటున్నారు. గతంలో వాడి వదిలేసిన ప్లాట్‌ఫామ్.. అర్కూట్‌కు సంబంధించి మీమ్స్ షేర్ చేస్తున్నారు.
 
గత ఫిబ్రవరి 25వ తేదీన కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎంఈఐటీవై) నూతన ఐటీ నిబంధనలను నోటిఫై చేసింది. మూడు నెలల్లో ఐటీ నిబంధనలను పాటించాలని ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌కూ తదితర సోషల్ మీడియా సంస్థలను కేంద్రం కోరింది. 
 
ఒకవేళ నిబంధనలను పాటించకపోతే, భారత్‌లో సదరు కంపెనీల లావాదేవీలకు తక్షణం తెర పడినట్లేనని అధికార వర్గాలు తెలిపాయి. ఈ హ్యాష్‌ట్యాగ్‌లు పోస్ట్ చేయడంతోపాటు ట్విట్టర్ యూజర్లు ఆర్కూట్ అనే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ సంగతి ప్రస్తావిస్తున్నారు. 2014 సెప్టెంబర్ 30న ఇది పూర్తిగా మూతపడింది.
 
2000వ దశకం చివరిలో సెర్చింజన్ గూగుల్‌.. సొంతంగా అర్కూట్ పేరిట సోషల్ మీడియా వేదికను నిర్వహించింది. అప్పట్లో అత్యధికులు వాడిన సోషల్ మీడియా వెబ్‌సైట్లలో ఇది ఒకటిగా నిలిచింది. 
 
సోషల్ మీడియా దిగ్గజ సంస్థలు తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వ నూతన ఐటీ రూల్స్‌ను అమలు చేయాల్సిందేనని నిపుణులు భావిస్తున్నారు. దేశ డిజిటల్ మీడియాలో ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ సమగ్ర భాగం అని, తప్పించుకోవడానికి వీల్లేదని అంటున్నారు.