జియో దివాలీ ధన్ ధనా ధన్... ఎయిర్‌టెల్‌కి దిమ్మతిరిగే షాక్... ఏంటో తెలుసా?

రిలయన్స్ జియో తన ప్రత్యర్థులను లేవలేని దెబ్బలు తీసేందుకు ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులు వేసుకుంటూ వ్యూహాత్మకంగా ముందుకు వెళుతోంది. జియో రూ. 1500 ఫీచర్ ఫోన్‌కు పోటీగా ఎయిర్‌టెల్ కొత్త స్మార్ట్ ఫోన్‌ను అత్యంత తక్కువ ధరకే మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు

reliance jio - airtel
ivr| Last Modified గురువారం, 12 అక్టోబరు 2017 (14:00 IST)
రిలయన్స్ జియో తన ప్రత్యర్థులను లేవలేని దెబ్బలు తీసేందుకు ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులు వేసుకుంటూ వ్యూహాత్మకంగా ముందుకు వెళుతోంది. జియో రూ. 1500 ఫీచర్ ఫోన్‌కు పోటీగా ఎయిర్‌టెల్ కొత్త స్మార్ట్ ఫోన్‌ను అత్యంత తక్కువ ధరకే మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. అంతే జియో మళ్లీ మరో అస్త్రాన్ని సంధించింది.

రూ. 399 రీచార్జ్ పైన 100 శాతం క్యాష్ బ్యాక్‌ను అందిస్తామనీ, దానికి 'జియో దివాలీ ధన్ ధనా ధన్' ఆఫర్‌లో భాగంగా వినియోగదారులు దీన్ని అందిపుచ్చుకోవచ్చని వెల్లడించింది. ఇది మూడు నెలల పాటు చెల్లుబాటవుతుందనీ, రూ. 50 విలువగల 8 ఓచర్లు లభిస్తాయని తెలిపింది.

ఈ కూపన్లను నవంబర్ 15 తరువాత రీచార్జ్ కూపన్లుగా వాడుకోవచ్చని పేర్కొంది. ఈ అవకాశం వినియోగదారులకు ఇవాళ్టి నుంచి దీపావళి వరకూ అందుబాటులో వుంచుతున్నట్లు వెల్లడించింది. మరి జియో దెబ్బకు ఎయిర్ టెల్ ఎలాంటి ప్లాన్ వేస్తుందో చూడాలి.దీనిపై మరింత చదవండి :