శనివారం, 21 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 7 ఏప్రియల్ 2017 (10:49 IST)

ట్రాయ్ ఆదేశం.. సమ్మర్ ఆఫర్ వెనక్కి తీసుకున్న జియో.. 4జీ ల్యాప్‌టాప్‌పై దృష్టి

రిలయన్స్ జియో మరో సంచలనానికి దారితీసింది. టెలికాం రంగంలోకి అడుగుపెట్టి రోజుకో సంచలన ప్రకటన చేస్తున్న జియో ప్రస్తుతం 4జీ సామర్థ్యం కలిగిన ల్యాప్‌టాప్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది. ఇందులో సిమ్ కార్డ

రిలయన్స్ జియో మరో సంచలనానికి దారితీసింది. టెలికాం రంగంలోకి అడుగుపెట్టి రోజుకో సంచలన ప్రకటన చేస్తున్న జియో ప్రస్తుతం 4జీ సామర్థ్యం కలిగిన ల్యాప్‌టాప్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది. ఇందులో సిమ్ కార్డు కోసం ప్రత్యేక స్లాట్ ఉండటం విశేషం. యాపిల్ సంస్థకు చెందిన 13.3 అంగుళాల మ్యాక్‌బుక్‌ను ఇది పోలివుంటుందని సమాచారం.
 
ఈ ల్యాప్‌టాప్‌ ఫుల్  హెచ్డీ డిస్‌ప్లే కలిగివుంటుంది. ఇంకా వీడియో కాలింగ్ హెచ్‌డీ కెమెరాను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఇంకా  4జీ, ఎల్‌టీఈ, హెచ్‌డీఎంఐ పోర్టు సదుపాయంతో రెండు యూఎస్‌బీ పోర్ట్స్ కూడా ఈ ల్యాప్‌టాప్‌లో ఉంటాయని వార్తలొస్తున్నాయి. అలాగే 4జీబీ ర్యామ్, 128 జీబీ ఇన్‌బుల్ట్ మెమొరీ, మరో 64 జీబీ వరకు పెంచుకునే సదుపాయం ఉన్నట్లు సమాచారం. 
 
మరోవైపు రిలయన్స్ జియోకు కస్టమర్లకు బ్యాడ్ న్యూస్. సమ్మర్ ఆఫర్లను వెనక్కి తీసుకోవాలని జియోకు ఆదేశాలు జారీ చేసింది ట్రాయ్. ‘జియో ప్రైమ్‌ మెంబర్‌షిప్‌’ పొడిగింపు నిర్ణయాన్ని, రూ.303కే 3 నెలల పాటు ఇచ్చే కాంప్లిమెంటరీ ఆఫర్‌ను వెనక్కితీసుకోవాలని రిలయన్స్‌ జియోకు సూచించింది. ట్రాయ్‌ ఆదేశాలపై ఏకీభవిస్తామని జియో కూడా ప్రకటించింది. కొద్ది రోజుల్లోనే సమ్మర్ ప్లాన్‌ను వెనక్కి తీసుకునేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. అయితే ఇది వరకే ‘సమ్మర్‌ సర్‌ప్రైజ్‌’ రీచార్జ్‌ చేసుకున్నవారికి మాత్రం ఈ ఆఫర్‌ వర్తిస్తుందని జియో ఓ ప్రకటనలో పేర్కొంది.