జియోకు.. దాని సేవలకు ఓ దండం బాబూ.. షాకిస్తున్న కస్టమర్లు

దేశీయ టెలికాం సేవల రంగంలోకి అడుగుపెట్టిన క్షణం నుంచి పెను తుఫాను సృష్టించిన రిలయన్స్ జియోకు.. ఇపుడు కస్టమర్లు తేరుకోలేని షాకిస్తున్నారు. జియోకు, దాని సేవలకు ఓ దండం బాబూ అంటూ వాపోతున్నారు. గడచిన ఏప్రిల

reliance jio
pnr| Last Updated: మంగళవారం, 16 మే 2017 (09:44 IST)
దేశీయ టెలికాం సేవల రంగంలోకి అడుగుపెట్టిన క్షణం నుంచి పెను తుఫాను సృష్టించిన రిలయన్స్ జియోకు.. ఇపుడు కస్టమర్లు తేరుకోలేని షాకిస్తున్నారు. జియోకు, దాని సేవలకు ఓ దండం బాబూ అంటూ వాపోతున్నారు. గడచిన ఏప్రిల్ నుంచి టారిఫ్ వసూలును ప్రారంభించే సరికి, ఇక జియో వద్దంటూ తమ పాత సర్వీస్ ప్రొవైడర్ల నంబర్లనే వాడటం మొదలు పెట్టారు. దీంతో జియోకు భారీ షాకే తగులుతోంది. ఇదే సమయంలో జియో పుణ్యమాని మిగతా టెలికాం సంస్థల డేటా రేట్లు కూడా దిగిరావడంతో కస్టమర్లు జియోను వీడుతున్నట్టు తెలుస్తోంది.

ఉచిత వాయిస్‌కాల్స్, డేటా సర్వీసులను అందించడంతో మొబైల్ కస్టమర్లంతా జియోకు క్యూ కట్టారు. దీంతో ఇతర టెలికాం కంపెనీలు కుదేలయ్యాయి. ఈ క్రమంలో అతి తక్కువ కాలంలో 10 కోట్ల మంది వినియోగదారులను సొంతం చేసుకున్న సంస్థగా జియో ఖ్యాతికెక్కింది. ఈ నేపథ్యంలో... వినియోగదారుల నుంచి జియో చార్జీలు వసూలు చేయడం మొదలుపెట్టాక.. మొబైలు యూజర్లు తిరిగి పాత సర్వీస్ ప్రొవైడర్ల వైపే మొగ్గు చూపుతున్నారు.

దీనిపై ఐడియా సెల్యులార్ మేనేజింగ్ డైరెక్టర్ హిమాన్షు కపానియా స్పందిస్తూ.. ఇక తమ నుంచి జియోకు వెళ్లిన ఖాతాదారుల్లో చాలా మంది తిరిగి వెనక్కి వచ్చారని, దీని ప్రభావంతో కొత్త ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో నష్టాల నుంచి గట్టెక్కుతామన్న నమ్మకం ఉందన్నారు. చార్జీల వసూళ్లు ప్రారంభించిన తర్వాత డేటా కస్టమర్లు జియో నెట్ వర్క్‌ను వీడుతున్నారన్నారు.దీనిపై మరింత చదవండి :