శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 28 మే 2020 (19:52 IST)

ఫేస్‌బుక్‌తో శాంసంగ్ ఇండియా ఒప్పందం.. ఎందుకంటే?

సోషల్ మీడియాలో అగ్రగామి అయిన ఫేస్‌బుక్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు శాంసంగ్‌ ఇండియా ప్రకటించింది. సాధారణ రిటైల్‌ దుకాణదార్లు కూడా ఆన్‌లైన్‌కు వెళ్లేలా శిక్షణ ఇచ్చే నిమిత్తం.. ఈ డీల్ కుదుర్చుకున్నట్లు శాంసంగ్ ఇండియా తెలిపింది. ఈ భాగస్వామ్యంతో భారీ స్థాయిలో ఉన్న రిటైల్‌ భాగస్వాములు డిజిటల్‌కు వెళతారని శాంసంగ్‌ ఇండియా సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (మొబైల్‌ బిజినెస్‌) మన్‌దీప్‌ సింగ్‌ పేర్కొన్నారు.
 
ఇప్పటికే తొలి దశ కింద 800కు పైగా ఆఫ్‌లైన్‌ రిటైలర్లకు శిక్షణ ఇవ్వగా.. రాబోయే కొద్ది వారాల్లో మరిన్ని శిక్షణ శిబిరాలు చేపట్టనున్నట్లు కంపెనీ తెలిపింది. సాధారణ రిటైలర్లు ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సప్‌ ఖాతాల ద్వారా బిజినెస్‌ పేజీలు ఏర్పాటు చేసుకోవడం, వినియోగదార్లకు స్మార్ట్‌ఫోన్ల గురించి ఎక్కువ వివరాలను అందించడానికి ఈ శిక్షణ ఉపయోగపడుతుందని ఫేస్‌బుక్ తెలిపింది.