1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 1 జులై 2024 (23:07 IST)

గెలాక్సీ జెడ్ సిరీస్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ల కోసం ముందస్తు రిజర్వేషన్ తెరిచిన శాంసంగ్

Foldable Smartphones
వినియోగదారులు ఇప్పుడు తమ తదుపరి గెలాక్సీ జెడ్ సిరీస్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లను ముందస్తుగా రిజర్వ్ చేసుకోవడం ద్వారా ముందస్తు యాక్సెస్, ప్రత్యేక ఆఫర్‌లను పొందేందుకు అర్హత పొందవచ్చని భారతదేశపు అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ శాంసంగ్ తెలిపింది. Samsung అధికారిక వెబ్ సైట్, శాంసంగ్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్స్, Amazon సైట్, Flipkart సైట్, భారతదేశం అంతటా ఉన్న ప్రముఖ రిటైల్ అవుట్‌లెట్‌లలో రూ. 2000 మొత్తాన్ని చెల్లించడం ద్వారా కస్టమర్‌లు తమ తదుపరి గెలాక్సీ జెడ్ సిరీస్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లను ముందస్తు రిజర్వ్ చేసుకోవచ్చు. గెలాక్సీ జెడ్ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను ముందస్తుగా రిజర్వ్ చేసుకున్న వినియోగదారులు ఈ ఉత్పత్తులను కొనుగోలు చేస్తే రూ. 7000 వరకు విలువైన ప్రయోజనాలను పొందుతారు.
 
జూలై 10న జరిగే గ్లోబల్ ఈవెంట్‌లో తదుపరి తరం గెలాక్సీ జెడ్ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు, దాని సంబంధిత ఉపకరాలను విడుదల చేయనున్నట్లు శాంసంగ్  ఇటీవల ప్రకటించింది. గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ పారిస్‌లో జరుగనుంది. తమ తాజా అత్యాధునిక ఆవిష్కరణలను చేయటానికి ఐకానిక్ సాంస్కృతిక అనుబంధం, ట్రెండ్ కేంద్రంగా నిలిచిన పారిస్ దీనికి సరైన నేపథ్యంగా మారుతుంది అని శాంసంగ్ ఒక ప్రకటనలో తెలిపింది.
 
"గెలాక్సీ ఏఐ యొక్క తదుపరి ఆవిష్కరణ వస్తోంది. గెలాక్సీ ఏఐ యొక్క శక్తిని కనుగొనడానికి సిద్ధం అవండి, ఇప్పుడు తాజా గెలాక్సీ జెడ్ సిరీస్, మొత్తం గెలాక్సీ పర్యావరణ వ్యవస్థలోకి ఇది చొప్పించబడింది. మేము మొబైల్ ఏఐ యొక్క కొత్త దశలోకి ప్రవేశించినప్పుడు అవకాశాల ప్రపంచానికి సిద్ధంగా ఉండండి” అని కంపెనీ జోడించింది.
 
శాంసంగ్ ఇండియా తమ తదుపరి శాంసంగ్ గెలాక్సీ వేరబల్, హియరబల్ పరికరాల కోసం ప్రీ-రిజర్వ్‌ను కూడా ప్రకటించింది. కస్టమర్‌లు 1999 రూపాయల టోకెన్ మొత్తంతో శాంసంగ్ తదుపరి గెలాక్సీ ఎకోసిస్టమ్ ఉత్పత్తులను ముందస్తుగా రిజర్వ్ చేసుకోవచ్చు, ఈ ఉత్పత్తుల కొనుగోలుపై రూ.6499 వరకు విలువైన ప్రయోజనాలను పొందవచ్చు. విశ్లేషకులు వెల్లడించే దాని ప్రకారం, పూర్తిగా కొత్త, ప్రత్యేకమైన ఏఐ అనుభవాన్ని అందించడానికి విడుదల చేయబోయే ఫోల్డబుల్ పరికరాల కోసం గెలాక్సీ ఏఐ అనుభవాన్ని శాంసంగ్ మెరుగు పరచనుంది.