భారతదేశంలో 200 మిలియన్లకు పైగా నెలవారీ క్రియాశీల స్నాప్‌చాటర్‌ల మైలురాయిని చేరుకున్నట్లుగా స్నాప్ ఇన్ కార్పొరేషన్ నేడిక్కడ ప్రకటించింది. కంపెనీ ప్రముఖ ప్రపంచ వృద్ధి మార్కెట్‌లలో భారత్ ఒకటి. స్థానికీకరించిన ప్లాట్‌ఫామ్ అనుభవం, స్థానిక కంటెంట్ కార్యక్రమాలు, భాగస్వా మ్యాలు, స్పాట్‌లైట్, స్టోరీస్ తో ప్రాంతీయ సృష్టికర్తలపై ప్రత్యేక దృష్టి సారించడం ద్వారా స్నాప్ భారతదేశంలో పెట్టుబడి పెట్టడం కొనసాగిస్తోంది, ఇవన్నీ స్నాప్ ఈ ముఖ్యమైన మైలురాయిని చేరుకోవడంలో సహాయ...