పేటీఎంకు మరోసారి ఎదురుదెబ్బ: ముగ్గురూ ఒకేసారి రాజీనామా?

శుక్రవారం, 24 డిశెంబరు 2021 (15:46 IST)
ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ సంస్థ పేటీఎంకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా సంస్థకు చెందిన ముగ్గురు సీనియర్ ఉద్యోగులు బయటకు వెళ్ళిపోయారు. రాజీనామాలు చేసిన వారిలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అభిషేక్ అరుణ్, ఆఫ్ లైన్ పేమెంట్స్ సీవోవో రేణు సాతి, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అభిషేక్ గుప్తా ఉన్నారు.
 
వీరు ముగ్గురూ ఒకరివెంట మరొకరు రాజీనామా చేసినట్టు సమాచారం. అభిషేక్ అరుణ్ ఐదేళ్లకు పైగా పేటీఎంలో ఉన్నారు. అభిషేక్ గుప్తా, రేణు సాతి గత ఏడాదే పేటీఎంలో చేరారు. 
 
అయితే వీరు రాజీనామాలు చేసినట్టు పేటీఎం అధికారికంగా ప్రకటించలేదు. ఈ ఏడాది ఆరంభంలో ఐదుగురు సీనియర్ ఎగ్జిక్యూటివ్ లు సంస్థ నుంచి బయటకు వెళ్లారు. ఇటీవలే పేటీఎం ఐపీఓకు వెళ్లింది.
 
అయితే ఈ ఐపీఓ ఆదిలోనే నిరాశపరిచింది. ఈ తరుణంలో ముగ్గురు టాప్ లెవెల్ అధికారులు బయటకు వెళ్లడం కంపెనీకి పెద్ద దెబ్బగానే భావించవచ్చు.

అన్నీ చూడండి

Aishwarya Rajesh: హీరోయిన్ కి మూడేళ్ళ స్పాన్ అనే వారు. అదే నిజం అనుకున్నా : ఐశ్వర్య రాజేష్

జీ5 కిడ్స్ లో యానిమేటెడ్ పౌరాణిక సిరీస్ శివలోక్ కె కుండక్క మండక్క

అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్, డైరెక్టర్ ప్రియదర్శన్. హైవాన్ లుక్

ప్రేమ, జ్ఞాపకాలతో తెరకెక్కిన సహ సినిమా చాలా నచ్చింది : కిరణ్ అబ్బవరం

Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఆవిష్కరించిన ఫీల్ మై లవ్ ఫస్ట్ లుక్ పోస్టర్

తర్వాతి కథనం
Show comments