శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By ఎంజీ
Last Modified: మంగళవారం, 16 నవంబరు 2021 (23:00 IST)

కరివేపాకు ఆకులతో పేస్ట్‌ తయారు చేసి మజ్జిగలో కలిపేసుకుని రోజూ తాగితే?

జలుబు కాగానే మెడికల్‌ షాప్‌కు, తలనొప్పి రాగానే వీధి చివర ఆర్‌ఎంపీ డాక్టర్‌ దగ్గరకు పరుగెత్తుతుంటారు. ఇలాంటి చిన్న చిన్న జబ్బులకు ఇంటి వైద్యంతోనే చెక్‌ పెట్టేయొచ్చు. అలాంటి కొన్ని చిట్కాలు..
 
కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఓ 10 ఆకులతో పేస్ట్‌ తయారు చేసి మజ్జిగలో కలిపేసుకుని రోజూ తాగితే కాలేయం వ్యర్థ పదార్థాల నుంచి రక్షణ పొందుతుంది. రోజూ ఓ 8 ఆకుల్ని మిర్యాలతో కలిపి తింటే ముక్కులో వచ్చే అలర్జీలు తగ్గిపోతాయి.
 
వేపాకు, యాంటీ సెప్టిక్‌గానూ, ఇన్‌సెక్టిసైడ్‌గానూ బాగా పనిచేస్తుంది. వేపాకు పొడిని నీళ్లల్లో కలిపి చల్లితే ఎన్నో రకాల క్రిమి కీటకాలు ఇంటికి దూరంతా వెళ్లిపోతాయి. వే పాకుల్ని నీటిలో వేసి మరగించి స్ర్పే చేస్తే దోమల బెడద తప్పుతుంది. వేపాకు పొడిని పేస్ట్‌గా చేసి వాడితే పలు రకాల చర్మ సమస్యలు, మొటిమలు, ఎక్జీమాల బాధలు తప్పుతాయి.
 
తులసి ఆకులు, వ్యాధి నిరోధక శక్తిని వృద్ధి చేయడమే కాదు, శ్వాసకోశ వ్యవస్థను బలోపేతం చేస్తాయి. ఓ ఐదారు ఆకుల కషాయాన్ని మరగించి టీ మాదిరి చేసుకుని తాగితే, దగ్గు, జలుబు, ఆస్తమా అదుపులోకి వస్తాయి.
 
రోజూ రెండు మూడు మెంతి ఆకుల్ని నమిలి చప్పరిస్తే, జీర్ణశ క్తి పెరిగి, కడుపు ఉబ్బరం, తే న్పులు తగ్గుతాయి. శ్వాసకోశాల శక్తి పెరుగుతుంది.
 
పసుపును పేస్ట్‌గా రోజూ ముఖానికి వాడితే, ముఖం మీద ఉండే సన్నని వెంట్రుకలు రాలిపోతాయి. అలాగే మొటిమలు, మచ్చలు కూడా మాయమవుతాయి. ఇది గొప్ప యాంటీ ఆక్సిడెంటు కాబట్టి రోజు మొత్తంలో ఒక టీ స్పూను దాకా కడుపులోకి తీసుకోవచ్చు.
 
మందారం ఆకుల్ని నూరి షాంపూగా వాడితే జుత్తు బాగా పెరుగుతుంది. చుండ్రు నివారణలోనూ, తెల్ల వెంట్రుకల నిరోధకంలోనూ బాగా సాయమవుతుంది. ఒక కప్పు నీటిలో ఒక పూవు చొప్పున వేసి ఆ నీళ్లను తాగితే రక్తంలో ఐరన్ పెరుగుతుంది.
 
కలబంద గుజ్జు ఇదొక సహజసిద్ధమైన కండీషనర్‌. మాయిశ్చరైజర్‌ కూడా. ఈ గుజ్జును చర్మం మీద, కపాలం మీద రుద్దితే, చుండ్రు సమస్యలు, చర్మ వ్యాధులు చాలా వరకు తగ్గుతాయి. ఈ గుజ్జుతో కాలిన గాయాలు కూడా త్వరగా మానిపోతాయి.
 
గోరింటాకు, జుత్తుకు సహజసిద్ధమైన రంగుగానే కాకుండా, ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ నివారణలోనూ బాగా తోడ్పడుతుంది. వెంట్రుక కుదుర్లను పటిష్టం చేయడం ద్వారా ఇది చుండ్రును, జుత్తు రాలడాన్ని నివారిస్తుంది.
 
అల్లం, జీర్ణశక్తిని పెంచడంతో పాటు క డుపులోని వికారాన్ని తగ్గిస్తుంది. అల్లం రసాన్ని తేనెతో కలిపి తీసుకుంటే, ఆకలి పెరుగుతుంది.