గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 30 జులై 2021 (23:26 IST)

మజ్జిగలో కొద్దిగ పసుపు కలిపి పేస్టులా చేసి ముఖానికి పట్టిస్తే...?

మజ్జిగలో కొద్దిగ పసుపు కలిపి పేస్టులా చేసుకోవాలి. దీనిని కంటి కింద రాసుకోవాలి. పది నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వలన మంచి ఫలితాన్ని పొందవచ్చు.
 
కంటి కింద ఏర్పడిన నల్లటి వలయాలు తొలగించుకోవటానికి టమాటాలు ఎంతగానో దోహదపడతాయి. ఒక టీ స్పూన్ టమోటా జ్యూస్‌లో కొద్దిగా నిమ్మరసం కలిపి కంటి కింద రాయాలి. పది నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఇలా రోజుకు రెండుసార్లు చేయడం వలన మంచి ఫలితాన్ని పొందవచ్చు.
 
బంగాళదుంపలను సన్నగా తరిగి జ్యూస్‌లా చేయాలి. దీనిలో కాటన్ బాల్స్‌ను ముంచి కంటి కింద ఉంచాలి. పది నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేయడం వలన నల్లటి మచ్చలు తగ్గుముఖం పడతాయి.
 
చల్లటి పాలలో దూది ఉండలను కొద్దిసేపు ఉంచి తర్వాత రిప్రిజిరేటర్లో పెట్టాలి. వీటిని కళ్లు, నల్లటి వలయాలు ఉన్న ప్రాంతాన్ని కవర్ చేస్తూ కంటి కింద ఉంచాలి. ఇలా తరుచుగా చేయడం వలన చర్మంపై ఉన్న మచ్చలు తొలగిపోతాయి.
 
ఆరెంజ్ జ్యూస్‌లో కొద్దిగా గ్లిజరిన్ కలిపి కంటికింద పూయాలి. ఇలా చేయడం వలన నల్లటి వలయాలు తగ్గడమే కాకుండా చక్కటి మెరుపు కూడా సంతరించుకుంటుంది.
 
కీరదోస ముక్కలను గుండ్రంగా తరిగి కంటి కింద పెట్టుకోవటం వలన నల్లటి వలయాలు తగ్గుముఖం పడతాయి.