మంగళవారం, 26 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఫ్యాషన్
Written By సెల్వి
Last Updated : శనివారం, 17 జులై 2021 (11:18 IST)

మీ నగలు ఎక్కువకాలం మెరుస్తూ వుండాలంటే..?

మీ నగలు ఎక్కువకాలం మెరుస్తూ, నాణ్యతతో ఉండాలంటే.. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.  మీరు ప్రయాణాలు చేస్తున్నట్లైతే.. నగలను స్క్రాచ్‌లు పడకుండా, డామేజ్ అవ్వకుండా కాపాడాలంటే.. వాటి బాక్సుల్లో ఎక్స్ ట్రా పాడింగ్ పెట్టాలి. ఇక నగల డబ్బాల్లో సిలికా పౌచ్‌లను వాడడం వల్ల అవి తేమను గ్రహించి రాళ్ల నగల మెరుపు పోకుండా కాపాడతాయి. 
 
యాంటీ టర్నిష్ పేపర్ వాడడం వల్ల కూడా నగల మెరుపును కాపాడవచ్చు. ఇక ఫంక్షన్లు, పార్టీలకు వెళ్లి వచ్చాక.. నగలు తీసి అలా డ్రాయర్లో పడేయకుండా.. అవి పొడిగా ఉన్నాయా... చెమటతో ఉన్నాయా గమనించాలి. అలా ఉంటే కాసేపు గాలికి ఆరిన తరువాత భద్రపరచాలి. 
 
నగలను వేటికవే భద్రపరచండి. ఇప్పుడు మార్కెట్లో ఎయిర్ టైట్ పౌచ్‌లు, బాక్సులు దొరుకుతున్నాయి. వీటిల్లో భద్రపరిస్తే తేమ చేరకుండా జాగ్రత్తగా ఉంటాయి సాధారణంగా అందరూ చేసే మామూలు తప్పు ఏంటంటే.. రెండు వేర్వేరు రకాల ఆభరణాలను ఒకే పెట్టెలో పెట్టడం. దీనివల్ల ఒకదాంట్లో ఒకటి చిక్కుకుపోయి.. నగలు విరగడం లేదా రాళ్ల మెరుపు దెబ్బతినడం.. ఊడిపోవడం జరుగుతాయి. 
 
ఇక వజ్రాల విషయానికి వచ్చేసరికి వీటిని.. తేలికపాటి సబ్బు కలిపిన గోరువెచ్చని నీటిలో నానబెట్టాలి. అయితే దీనికోసం డిటర్జెంట్లను వాడకూడదు. కాసేపటి తరువాత మృదువైన టూత్ బ్రష్ ను ఉపయోగించి రుద్ది కడగాలి. ఆపై మృదువైన శుభ్రమైన మెత్తటి క్లాత్ తో తడిపోయేలా తుడిచేయాలి.  బంగారు ఆభరణాలను ప్రతి సంవత్సరం మీకు నమ్మకమైన ఆభరణాల తయారీదారు వద్ద శుభ్రం చేయించాలి. వారికైతే ఏ రాళ్లను ఎలా కడగాలి.. ఎంత వరకు కడిగితే, శుభ్రం చేస్తే నగలు మెరిసిపోతాయో బాగా తెలిసి ఉంటుంది.