మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 13 ఆగస్టు 2017 (16:02 IST)

స్మార్ట్ ఫోన్ యూజర్లకు శుభవార్త.. ఐసీయూ తగ్గనుందట.. అంతా జియో ఎఫెక్ట్..

టెలికాం రంగంలో పెను సంచలనం సృష్టించిన జియో ఉచిత కాల్స్‌ అందించే క్రమంలో ఇంటర్‌కనెక్ట్‌ యూసేజ్‌ ఛార్జీలతో ఇబ్బందులు ఎదుర్కొంది. ఈ ఛార్జీలను పూర్తిగా తొలగించాలని రిలయన్స్‌ జియో కోరుతోంది. అయితే వీటిని మ

టెలికాం రంగంలో పెను సంచలనం సృష్టించిన జియో ఉచిత కాల్స్‌ అందించే క్రమంలో ఇంటర్‌కనెక్ట్‌ యూసేజ్‌ ఛార్జీలతో ఇబ్బందులు ఎదుర్కొంది. ఈ ఛార్జీలను పూర్తిగా తొలగించాలని రిలయన్స్‌ జియో కోరుతోంది. అయితే వీటిని మరింత పెంచాలని ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌, ఐడియావంటి మొబైల్‌ ఆపరేటర్లు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు ట్రాయ్ శుభవార్త చెప్పింది. 
 
ఈ క్రమంలో ఇంటర్‌కనెక్ట్‌ యూసేజ్‌ ఛార్జీల(ఐసీయూ)ను తగ్గించేందుకు ట్రాయ్‌ కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. దీంతో కాల్ ఛార్జీలు, డేటా ప్యాక్‌లు ధరలు దిగివస్తున్న క్రమంలో ఐసీయూను తగ్గించడం ద్వారా వినియోగదారులు పండగ చేసుకున్నట్లే. ఇప్పటివరకు వివిధ ఆపరేటర్లు కాల్స్‌ను కనెక్ట్‌ చేసేందుకు వసూలు చేస్తున్న ఐసీయూను ప్రస్తుతం నిమిషానికి 14 పైసల నుంచి 10 పైసలకు తగ్గించనున్నారు.
 
గత ఏడాది సెప్టెంబరులో రిలయన్స్ జియో రాకతో మొబైల్ టారిఫ్‌లు ప్రభావితమైన క్రమంలో ఐసీయూ వసూలు కీలకాంశంగా మారింది. అయితే ప్రస్తుతం దాన్ని తగ్గించడం ద్వారా వినియోగదారుల కష్టాలు తగ్గే అవకాశం ఉంది.