గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 17 ఫిబ్రవరి 2023 (17:19 IST)

భారత్‌లో మూడు కార్యాలయాలను మూసివేసిన ట్విట్టర్

elon musk
ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ తన కార్యాలయాలను మూసేసుకుంటూ వస్తుంది. తాజాగా భారత్‌లో రెండు ఆఫీసులను మూసివేసింది. ఇక మిగిలింది ఒకే ఒక్క కార్యాలయం మాత్రమే. అది కూడా బెంగుళూరులో ఉంది. భారత్‌లోని మొత్తం ట్విట్టర్ సిబ్బందిలో 90 శాతం మంది ఉద్యోగులను ప్రభుత్వం తొలగించింది. సంస్థ మొత్తం సిబ్బందిలో వీరి వాటా 90 శాతమని ఓ అంచనా వేశారు. ఇక బెంగుళూరు శాఖలోని సిబ్బందిలో అత్యధికులు ఇంజనీర్లేనని విశ్వసనీయ వర్గాల సమాచారం. 
 
మరోవైపు, ట్విట్టర్‌ను హస్తగతం చేసుకున్న తర్వాత టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్.. సంస్థను లాభాల బాటలో పట్టించేందుకు తీసుకోవాల్సిన అన్ని రకాల చర్యలు తీసుకున్న విషయం తెల్సిందే. 2023 నాటికి సంస్థకు ఆర్థిక స్థిరత్వం ఇవ్వాలన్న లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులోభాగంగా, అదనపు సిబ్బందితో పాటు అదనపు కార్యాలయాలను మూసివేస్తూ వచ్చారు. 
 
ఇందులోభాగంగా, భారత్‌లోని ఉన్న మూడు కార్యాలయాల్లో రెండింటిని మూసివేశారు. భారత్‌లో ట్విట్టర్ ప్రజాభిప్రాయం, వ్యక్తీకరణ, రాజకీయ చర్చలకు కీలక వేదికగా మారింది. ట్విట్టర్‌లో ప్రధాని నరేంద్ర మోడీకి ఏకంగా 86.5 మిలియన్ ఫాలోయర్లు ఉన్న విషయం తెల్సిందే. అయితే, మొత్తం ట్విట్టర్ ఆదాయంలో భారత్ వాటా స్వల్పంగా ఉన్న విషయం తెల్సిందే.