శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 15 అక్టోబరు 2020 (20:40 IST)

వివో వై30 స్మార్ట్ ఫోన్‌ ధర తగ్గిందోచ్... ఎంతో తెలుసా?

Vivo Y30
వివో వై30 స్మార్ట్ ఫోన్‌ ధర తగ్గింది. ఈ సంవత్సరం జూలైలో దేశంలో విడుదలైన ఈ ఫోన్‌లో మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్‌ను అందించారు. అలాగే వెనకవైపు నాలుగు కెమెరాలు కూడా ఉన్నాయి. ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది.

4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ఉన్న ఈ వేరియంట్ ధర లాంచ్ అయినప్పుడు రూ.14,990గా నిర్ణయించారు. ఇప్పుడు రూ.1,000 తగ్గింపుతో రూ.13,990కు తగ్గింది. డాజిల్ బ్లూ, ఎమరాల్డ్ బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. అమెజాన్, వివో వెబ్ సైట్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. 
 
ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలను ఇందులో అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగా పిక్సెల్ కాగా, 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగా పిక్సెల్ మాక్రో లెన్స్, 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్ లను కూడా ఇందులో అందించారు. సెల్ఫీల కోసం ముందువైపు 8 మెగా పిక్సెల్ కెమెరా ఉంది. డ్యూయల్ సిమ్, డ్యూయల్ 4జీ, వైఫై, బ్లూటూత్ 5, జీపీఎస్, గ్లోనాస్, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ కూడా ఇందులో ఉన్నాయి. ఈ ఫోన్ బరువు 197 గ్రాములుగా ఉంది.
 
ఫీచర్స్ సంగతికి వస్తే?
ఇందులో 6.47 అంగుళాల డిస్ ప్లేను అందించారు. 
దీని యాస్పెక్ట్ రేషియో 19.5:9గా ఉంది. 
స్క్రీన్ టు బాడీ రేషియో 90.7 శాతంగా ఉంది. 
ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఫన్ టచ్ ఓఎస్ 7.2పై ఈ ఫోన్ పనిచేయనుంది. 
మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 
ఇందులో 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను అందించారు.
మైక్రో ఎస్ డీ కార్డు ద్వారా 256 జీబీ వరకు దీన్ని పెంచుకోవచ్చు. 
దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్. 10W ఫాస్ట్ చార్జింగ్ ను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది.
ఇందులో వెనకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను అందించారు.