రూ.24తో వొడాఫోన్ ప్రీపెయిడ్ ప్లాన్లు

vodafone logo
ఠాగూర్| Last Updated: శనివారం, 21 డిశెంబరు 2019 (16:45 IST)
దేశంలో ఉన్న ప్రైవేట్ టెలికాం కంపెనీల్లో ఒకటైన వొడాఫోన్ తాజాగా తన ప్రీపెయిడ్ కష్టమర్ల కోసం మరికొన్ని ప్లాన్లను ప్రవేశపెట్టింది. రూ.24, రూ.129, రూ.199, రూ.269 రీచార్జి ప్యాక్‌లలో ఈ ప్లాన్లు ల‌భిస్తున్నాయి.

రూ.24 ప్లాన్‌లో క‌స్ట‌మ‌ర్ల‌కు 100 ఉచిత ఆన్‌-నెట్ కాల్స్ వ‌స్తాయి. కాల్ కాస్ట్ సెక‌నుకు 2.5 పైస‌లు అవుతుంది. ఈ ప్లాన్ వాలిడిటీని 14 రోజులుగా నిర్ణ‌యించారు. అలాగే రూ.129 ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాల్స్‌, 300 ఎస్ఎంఎస్‌లు, 2జీబీ డేటా వ‌స్తాయి. వాలిడిటీ 14 రోజులుగా ఉంది.

ఇకపోతే, రూ.199 ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 1జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు వ‌స్తాయి. వాలిడిటీ 21 రోజులుగా ఉంది. రూ.269 ప్లాన్‌లో రోజుకు 4జీబీ డేటా, 600 ఎస్ఎంఎస్‌లు వ‌స్తాయి. వాలిడిటీ 56 రోజులుగా ఉంది.దీనిపై మరింత చదవండి :