శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: మంగళవారం, 17 డిశెంబరు 2019 (20:37 IST)

'కింగ్ ఫిషర్'తో మత్తు వదిలిస్తానంటున్న చిన్న‌కృష్ణ, అతడి ప్ర‌య‌త్నం ఫ‌లించేనా?

నరసింహనాయుడు, ఇంద్ర, గంగోత్రి, బద్రీనాథ్, జీనియస్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు కథలను అందించి సెన్సషనల్ కథారచయితగా పేరుతెచ్చుకున్న చిన్నికృష్ణ ఇప్పుడు నిర్మాణరంగంలోకి అడుగుపెడుతూ.. చిన్నికృష్ణ స్టూడియోస్ బ్యానర్‌ని స్థాపించారు. తొలి ప్రయత్నంగా "కింగ్ ఫిషర్" వంటి ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా తనయులు చిరంజీవి సాయి, బద్రీనాథ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
 
అలాగే యువ టాలెంటెడ్ దర్శకుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ చిత్రం బ్యానర్, టైటిల్ లోగో విడుదల కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ పారిశ్రామికవేత్త ఎంపి రామకృష్ణంరాజు, ప్రముఖ సీనియర్ దర్శకులు బి.గోపాల్, ప్రముఖ రచయితలు వి.వి.విజయేంద్రప్రసాద్, పరచూరి గోపాలకృష్ణ, యువదర్శకుడు కె.యస్.రవీంద్ర {బాబీ}, మాధవ్ పట్నాయక్ (కన్సూమర్ కోర్ట్ జడ్జి), నిర్మాతలు రాధామోహన్, దాసరి కిరణ్, కత్తి మహేష్, హీరో అవీష్, బాలకృష్ణ అభిమాని జగన్ పాల్గొన్నారు.
 
చిన్నికృష్ణ స్టూడియోస్ బ్యానర్ లోగోని వి.వి.విజయేంద్రప్రసాద్, పరచూరి గోపాలకృష్ణ, బి.గోపాల్ ఆవిష్కరించారు. ఈ సంద‌ర్భంగా చిన్నికృష్ణ స్టూడియోస్ అధినేత చిన్నికృష్ణ మాట్లాడుతూ.. తెనాలి నుండి సినిమాల మీద ఇంట్రెస్ట్‌తో చెన్నపట్నం వెళ్లి భాగ్యరాజా ద‌గ్గర రచయితగా వర్క్ చేశాను. సుజాత రంగరాజన్‌కి ఏకలవ్య శిష్యుడిగా రచనలో ఓనమాలు నేర్చుకున్నాను. ఆ తర్వాత పరచూరి సోదరులు బి.గోపాల్ గారు నన్ను ఎంకరేజ్ చేశారు. 
 
మా చిన్నికృష్ణ స్టూడియోస్ బ్యానర్లో నటీనటులకు టెక్నీషియన్స్‌కి కులమతాలకు అతీతంగా అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించే విదంగా సినిమాలు రూపొందించాలని పక్కాప్రణాళికతో మొదటి చిత్రంగా కింగ్ ఫిషర్‌తో స్టార్ట్ చేశాం. 
 
ఈ చిత్రానికి  అత్యంత ప్రతిభ గల ఓ యువ దర్శకుడు దర్శకత్వం వహిస్తున్నాడు. కింగ్ ఫిషర్ అనేది మల్టిపుల్ కలర్ వున్న ఒకరకమైన పక్షి పేరు. జనరల్‌గా కింగ్ ఫిషర్ అనగానే మత్తు, గ్యాస్ ఫిల్ చేసి కలిపి బాటిల్లో పోస్తే బీర్ అవుతుంది. అది తాగితే కిక్ ఇస్తుంది. మా కింగ్ ఫిషర్ మత్తుని వదిలిస్తుంది. 
 
2014 నుండి ఇప్పటివరకు నేను ఎంతోమందిని చూసాను. నన్ను మోసపుచ్చిన వారిని, ఇతరులని మోసగించిన వారిని అందర్నీ పరిశీలించాను. వారి మానత్వాన్ని, హ్యూమన్ రిలేషన్స్‌ని ఒక బాటిల్లో పొందుపరిచాను. అదే ఈ కింగ్ ఫిషర్. మోసగించే వాళ్ళ మత్తుని వదిలించి సమాజంలో మంచి మనుషులుగా మారుస్తుంది.. మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తాను అన్నారు. మ‌రి.. ర‌చ‌యిత‌గా ఒక‌ప్పుడు ఓ వెలుగు వెలిగిన చిన్నికృష్ణ నిర్మాత‌గా రాణిస్తాడో లేదో చూడాలి.