ఆ ఒక్క రాష్ట్రానికి వోడాఫోన్ బంపర్ ఆఫర్...

దేశీయ టెలికాం రంగంలో పెను ప్రకంపనలు సృష్టిస్తున్న రిలయన్స్ జియోను ధీటుగా ఎదుర్కొనేందుకు ఇతర ప్రైవేట్ టెలికాం కంపెనీలు కూడా తమకు తోచిన విధంగా ఆఫర్ల వర్షం కురిపిస్తున్నాయి. ఈ కోవలో ఇప్పటికే టెలికాం దిగ్

vodafone
pnr| Last Updated: గురువారం, 17 ఆగస్టు 2017 (12:44 IST)
దేశీయ టెలికాం రంగంలో పెను ప్రకంపనలు సృష్టిస్తున్న రిలయన్స్ జియోను ధీటుగా ఎదుర్కొనేందుకు ఇతర ప్రైవేట్ టెలికాం కంపెనీలు కూడా తమకు తోచిన విధంగా ఆఫర్ల వర్షం కురిపిస్తున్నాయి. ఈ కోవలో ఇప్పటికే టెలికాం దిగ్గజమైన ఎయిర్‌టెల్ ఒక అడుగు ముందు ఉంది. ఇపుడు వోడాఫోన్ చేరింది.

ప్రిపెయిడ్ వినియోగదారులకు రూ.348తో రీచార్జ్‌తో... 28 రోజుల పాటు రోజుకు 1జీబీ డేటా, అపరిమిత కాల్స్ అందించనున్నట్టు ప్రకటించింది. అయితే ఈ ఆఫర్ రాజస్థాన్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుందని చెప్పడం కాస్త నిరాశ కలిగించే విషయం.

మైవొడాఫోన్ యాప్‌తో పాటు, రాష్ట్రవ్యాప్తంగా అన్ని కంపెనీ స్టోర్లు, మినీస్టోర్లు, బ్రాండ్ రిటైల్ అవుట్‌లెట్లలో ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని రాజస్థాన్ బిజినెస్ హెడ్ అమిత్ బేడీ వెల్లడించారు. ఈ ఆఫర్‌కు వచ్చే స్పందనను బట్టి మిగిలిన రాష్ట్రాలకూ విస్తరించే అంశాన్ని పరిశీలిస్తామని ఆయన తెలిపారు.దీనిపై మరింత చదవండి :