సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 8 మే 2019 (15:15 IST)

షాకింగ్ న్యూస్ : విండోస్ ఫోన్లలో ఇకపై వాట్సాప్ పనిచేయదు

విండోస్ మొబైల్ యూజర్లకు ప్ర‌ముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తేరుకోలేని షాకిచ్చింది. ఇక‌పై విండోస్ ఫోన్ల‌లో ప‌నిచేయ‌ద‌ని ఆ సంస్థ ప్ర‌తినిధులు ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఈ యేడాది డిసెంబరు 31వ తేదీ తర్వాత విండోస్ ఫోన్లలో వాట్సాప్ ప‌నిచేయ‌ద‌ని వారు తెలిపారు. 
 
మైక్రోసాఫ్ట్ సంస్థ విండోస్ ఫోన్ల‌కు డిసెంబ‌ర్‌లో స‌పోర్ట్‌ను నిలిపివేయ‌నున్న నేప‌థ్యంలోనే తాము ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని వాట్సాప్ తెలిపింది. కాగా ఫిబ్ర‌వ‌రి 1, 2020 నుంచి ఆండ్రాయిడ్ 2.3.7, ఐఓఎస్ 7 అంతక‌న్నా త‌క్కువ వెర్ష‌న్ ఓఎస్‌లు ఉన్న డివైస్‌ల‌లోనూ వాట్సాప్ ప‌నిచేయ‌ద‌ని ఆ కంపెనీ పేర్కొంది.