శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 4 మార్చి 2024 (19:48 IST)

స్మార్ట్ ఫోన్.. ఇయర్ ఫోన్స్ వాడుతున్న వారైతే?

రోజు రోజుకీ టెక్నాలజీ పెరిగిపోతోంది. ఇందుకు కారణంగా మనం వాడే స్మార్ట్ ఫోన్. ప్రస్తుతం చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. స్మార్ట్ ఫోన్ లేనిదే పొద్దు గడవదు. స్మార్ట్ ఫోన్‌కు బదులు ఇయర్ ఫోన్స్, బ్లూటూత్ వంటి పరికరాలు చెవిని అంటిపెట్టుకుని వుంటున్నాయి. అయితే హెడ్ సెట్ల వాడకం ద్వారా 1.1 బిలియన్ యువత చెవులు వినిపించకుండా పోయే ప్రమాదంలో వున్నట్లు తాజా సర్వేలో తేలింది. 
 
సెల్ ఫోన్, ఇయర్ ఫోన్స్ తరంగాల కారణంగా చాలామంది యువతతో చెవి వినికిడి సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం ఏర్పడుతుంది. ఇదే విధానం కొనసాగితే.. కళ్లు, చెవి, ముక్కు సంబంధిత రుగ్మతలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 
 
అంతేగాకుండా ఇయర్ ఫోన్స్ ద్వారా మెదడు పనితీరుకు ముప్పు తప్పదని వారు చెప్తున్నారు. అధిక సమయం ఇయర్ ఫోన్స్ వాడటం ద్వారా వినికిడి లోపం తప్పదట. ఈ సమస్యను ఆపై సరిచేయడం కుదరదని తాజా అధ్యయనం తెలిపింది. కానీ ఇయర్ ఫోన్స్‌కు బదులు హెడ్ ఫోన్లను వాడటం ద్వారా కొంతవరకు వినికిడి సమస్యలను తగ్గించవచ్చు. 
 
హెడ్ ఫోన్లకు చెవికి వెలుపల ఉపయోగించడం ద్వారా చెవి వినికిడి కొంత మేరకు ఇబ్బంది వుండదు. ఇయర్ ఫోన్స్ లేదా హెడ్ సెట్స్ ఏవైనా మితంగా వాడితే మంచిది. పది నిమిషాలకు పైగా ఇయర్ ఫోన్స్ వాడటం మంచిది కాదు. ఇంకా చెవిలో ఇన్ఫెక్షన్లు ఏర్పడకుండా వుండాలంటే... రోజూ ఇయర్ ఫోన్స్‌ను శుభ్రం చేస్తుండాలి.