మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 5 సెప్టెంబరు 2023 (13:27 IST)

బ్లూటూత్ కాలింగ్ సౌకర్యంతో రూ.2వేలకు బడ్జెట్ స్మార్ట్ వాచ్

boAt
boAt
బోట్ కంపెనీ బోట్ వేవ్ ఎలివేట్ స్మార్ట్‌వాచ్ మోడల్‌ను భారత మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. కొత్త స్మార్ట్ వాచ్ యాపిల్ వాచ్ అల్ట్రా మాదిరిగానే కనిపిస్తుంది. వివిధ రంగులలో లభించే మెటాలిక్ బాడీ, కిరీటం, ఓషన్ బ్యాండ్ స్ట్రాప్‌తో వాచ్ అందుబాటులో ఉంది. ఇది పెద్ద 1.96 అంగుళాల హెచ్‌డీ స్క్రీన్ కలిగివుంటుంది. 
 
దీనితో పాటు, బ్లూటూత్ కాలింగ్ సదుపాయం, హై-క్వాలిటీ ఇన్-బిల్ట్ మైక్, డయల్ ప్యాడ్, కాంటాక్ట్ స్టోరేజ్ సదుపాయం వుంటాయి. కొత్త బోట్‌వేవ్ ఎలివేట్ మోడల్ హెల్త్ ట్రాకింగ్ ఫీచర్‌తో వస్తుంది. ఇది SpO2, స్లీప్, 50కి పైగా స్పోర్ట్స్ మోడ్‌లు, IP67 వాటర్, డస్ట్ రెసిస్టెంట్, ఐదు రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్‌ను అందించే బ్యాటరీని కలిగి ఉంది. 
 
కొత్త బోట్ వేవ్ ఎలివేట్ స్మార్ట్‌వాచ్ భారత మార్కెట్లో గ్రే, బ్లాక్, గ్రీన్, ఆరెంజ్ రంగుల్లో అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఈ స్మార్ట్ వాచ్ ధర రూ. 2,299. ఇది సెప్టెంబర్ 6న అమెజాన్‌లో సేల్ కానుంది.