గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కథనాలు
Written By
Last Modified: శుక్రవారం, 12 జులై 2019 (19:33 IST)

కిడ్స్ రూమ్‌లో వస్తువుల అమరిక ఎలా ఉండాలి?

పిల్లల గదులను వస్తువులతో నింపేయకుండా యాక్టివిటీస్ చేయడానికి తగినంత స్థలాన్ని ఇవ్వాలి. గది మరీ చిన్నదైతే  ఫర్నిచర్ ఎక్కువగా పెట్టకూడదు. రాక్స్ పెట్టినట్లయితే వాటిలో టాయ్స్, బుక్స్‌ను అమర్చుకోవచ్చు. 
 
పిల్లల హాబీలను గుర్తించి దానికి తగిన విధంగా ఫోటోగ్రాఫ్స్‌ని పేస్ట్ చేయాలి. పెన్సిల్స్, కలర్స్, గిటార్ వంటి మ్యూజికల్ పరికరాలు అమర్చుకోవడానికి స్టాండ్‌ని ఏర్పాటు చేయాలి. అమ్మాయిల గదికైతే పింక్ రంగును ఎంచుకోవచ్చు. అలాంటప్పుడు పిల్లోస్, కర్టెన్స్, ఇలా అన్నీ పింక్ రంగులో ఉండేలా చూసుకోవాలి. 
 
పిల్లల గదులు స్లిప్పరీగా ఉండకుండా చూసుకోవాలి. బాత్‌రూమ్‌లో యాంటీస్కిడ్ టైల్స్ వేయించాలి. పిల్లల గదుల్లో ఫ్లోర్ ల్యాంప్స్ ఉండకుండా చూసుకోవాలి. ఫ్లోర్ లెంగ్త్ కర్టెన్స్‌ను పెట్టకూడదు.