1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. మహాశివరాత్రి
  4. Lord shiva Puja method

మహాశివుడిని ఎలా పూజించాలంటే?

Lord shiva
మహాశివుడిని పూజించే ముందు వినాయకుడిని పూజించాలి. అంటే నీళ్లు, పాలు వంటి వాటిని ముందు వినాయకుడి విగ్రహానికి సమర్పించిన తర్వాత మరో దేవుళ్లకు ఉపయోగించాలి. ఎలాంటి పూజ చేసినా.. ముందుగా వినాయకుడిని పూజించాలనే స్వయంగా శివుడే వివరించాడు. తులసి ఆకులను ఎట్టిపరిస్థితుల్లో శివుడికి సమర్పించరాదు.
 
శుభ్రంగా స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించిన తర్వాత పూజ మొదలు పెట్టాలి. సూర్యోదయం సమయంలో ఇలా చేయడం వల్ల ఎక్కువ ఫలితాలు పొందవచ్చు. శివరాత్రి పూజ చేసే సమయంలో ఓం నమః శివాయ మంత్రాన్ని స్మరించుకోవాలి. అలాగే మహా మృత్యుంజయ మంత్రాన్ని పఠించవచ్చు.
 
నైవేద్యంగాకొబ్బరికాయ శివుడికి ప్రీతిపాత్రమైనదిగా చెబుతారు. శివలింగం ముందు కొబ్బరికాయ కొట్టి.. ఆ నీటిని లింగంపై ధారగా పోయాలి. కొబ్బరి ముక్కలను నైవేద్యంగా పెట్టాలి. అలాగే ఎండు ద్రాక్ష, అరటిపండ్లు, ఖర్జూరాలు శివుడికి ఇష్టమైన నైవేద్యంగా చెబుతారు. ఈ నైవేద్యాలు శివుడికి సమర్పించడం ద్వారా సకల సుఖ, సంతోషాలు కలుగుతాయని విశ్వాసం.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
మహా శివరాత్రి 2022: ఉపవాసం వుంటే ఇవి తినవచ్చు...