1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. మహాశివరాత్రి
Written By సెల్వి
Last Updated : సోమవారం, 28 ఫిబ్రవరి 2022 (17:31 IST)

మహాశివరాత్రి రుద్రాభిషేకం, శివ బిల్వార్చనతో..

మహా శివరాత్రి పండుగ నాడు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగుతాయి. తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలు శివరాత్రి పర్వదినాన్ని జరుపుకోవడానికి ఇప్పటికే సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. శైవ క్షేత్రాలకు పోటెత్తనున్న భక్తులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశారు. హరహర మహాదేవ శంభో అంటూ శివ నామ స్మరణతో శైవ క్షేత్రాలు మార్మ్రోగనున్నాయి.
 
మహా శివరాత్రి పర్వదినాన ప్రతి ఒక్కరూ అభిషేక ప్రియుడైన శివుడిని అభిషేక జలాలతో, బిల్వార్చనలతో రుద్రాభిషేకాలతో పూజిస్తారు. శివనామస్మరణతో శివుడికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నిస్తారు. ఎటువంటి ఆహారం తీసుకోకుండా ఉపవాస దీక్షలు చేస్తారు. రాత్రి వేళల్లో జాగరణ దీక్షలతో స్వామి వారిని పూజిస్తారు.
 
శివరాత్రి రోజున శివునికి అభిషేకం, శివారాధన అత్యంత పవిత్రమైనదిగా చెప్తారు. మహాశివరాత్రి రోజు సాయంత్రం ఆరు గంటల సమయం నుంచి అర్థరాత్రి 2 గంటల సమయం మధ్య చేసే రుద్రాభిషేకం, శివ బిల్వార్చన, అష్టైశ్వర్యాలను కలిగిస్తాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.