సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : బుధవారం, 16 ఫిబ్రవరి 2022 (11:34 IST)

మాఘపౌర్ణమి సాయంత్రం లలితా సహస్రనామాన్ని మరవద్దు

మాఘపౌర్ణమి రోజున లలితా జయంతి కూజా వచ్చింది.  మాఘ పౌర్ణమి రోజుల లలితాదేవి జయంతి రావడం ప్రత్యేకత. మాఘమాసంలో అమ్మవారిని ఏ రూపంలో పూజించినా ‘లలితా సహస్రనామా’న్ని పఠిస్తారు. అమ్మవారి స్తోత్ర పారాయణం చేయడం వల్ల అపారమయిన ప్రయోజనాలు కలుగుతాయి. 
 
పవిత్ర స్నానాలు చేసి, లలితా సహస్రనామ పఠనంతో అమ్మవారిని అర్చిస్తే అభీష్ట సిద్ధి కలుగుతుందనీ, అలాగే ‘ప్రాతఃస్మరామి లలితా వదనారవిందం…’ అంటూ ప్రారంభమయ్యే ‘శ్రీలలితా పంచ రత్న స్తోత్ర’ పారాయణ కూడా విశేష ఫలప్రదం అంటున్నారు జ్యోతిష్య నిపుణులు. 
 
మాఘ పౌర్ణమి రోజున చేసే స్నానం, పూజలు, దానాలు వల్ల వ్యాధులు, చికాకుల నుంచి విముక్తి కలుగుతుంది. ఆ పుణ్య ఫలాల విశేషం కారణంగా ఉన్నత జీవితం లభిస్తుంది. మరణం అనంతరం కోరుకునే శాశ్వత స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. 
 
గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి, నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధింకురు అనే శ్లోకం పఠిస్తూ స్నానం ఆచరించాలి. పవిత్ర సంగమం వద్ద మాఘ శుద్ధ పౌర్ణమి నాడు సింధూ స్నానాలు ఆచరిస్తే సర్వపాపాలు హరించుకుపోతాయనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం.