గురువారం, 9 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. మహాశివరాత్రి
Written By selvi
Last Updated : సోమవారం, 12 ఫిబ్రవరి 2018 (11:17 IST)

మహాశివరాత్రి.. లింగోద్భవ పూజ.. అభిషేకానికి పాలు, పండ్లు ఇస్తే?

మహాశివరాత్రి పూట రాత్రి ఆలయాల్లో లింగోద్భవం అవతారాన్ని స్మరించుకుంటూ నాలుగు కాలాల పూజ జరుగుతుంది. ఈ నాలుగు కాలాల పాటు మహేశ్వరునికి అభిషేకాలు జరుగుతాయి. శివలింగానికి పాలు, పంచామృతం, పండ్లు వంటి వాటితో

మహాశివరాత్రి పూట రాత్రి ఆలయాల్లో లింగోద్భవం అవతారాన్ని స్మరించుకుంటూ నాలుగు కాలాల పూజ జరుగుతుంది. ఈ నాలుగు కాలాల పాటు మహేశ్వరునికి అభిషేకాలు జరుగుతాయి. శివలింగానికి పాలు, పంచామృతం, పండ్లు వంటి వాటితో అభిషేకం చేస్తారు. అయితే తొలి, మలి, మూడు, నాలుగు కాలాల్లో ఏయే పదార్థాలతో అభిషేకం చేయాలని తెలుసుకుందామా.. అయితే ఈ కథనం చదవండి. 
 
మహాశివరాత్రి రోజున శివునికి అభిషేక వస్తువులను, సుగంద ద్రవ్యాలను సమకూర్చే వారికి సకల సంపదలు చేకూరుతాయంటారు ఆధ్యాత్మిక పండితులు. అలాగే శివరాత్రి రోజున జరిగే నాలుగు కాలాల్లో అభిషేకానికి పంచకవ్యం, పంచామృతం, తేనె, చెరకు రసంతో శివునికి అర్పించాలి. చందనం, పచ్చకర్పూరం, కస్తూరితో శివలింగానికి అర్చించాలి. ఎరుపు రంగు వస్తువులు తొలికాలంలోనూ, పసుపు రంగు దుస్తులు రెండో కాలంలోనూ, తెలుపు రంగు వస్తువులు మూడో కాలంలో, పచ్చరంగు దుస్తులు నాలుగో కాలంలో శివునికి సమర్పించే వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. 
 
ఈ పూజా సమయాల్లో శివపురాణం, లింగాష్టకం పఠించాలి. ఆలయాల్లో నెయ్యి, నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. తామర, బిల్వతో పాటు అన్నీ రకాల పువ్వులను స్వామికి సమర్పించుకోవచ్చు. పండ్లు పనస, దానిమ్మ, అరటితో పాటు అన్నీ పండ్లను మహాదేవునికి సమర్పించి.. ఆయన అనుగ్రహం పొందవచ్చునని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.