గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: సోమవారం, 18 డిశెంబరు 2017 (14:37 IST)

చంద్రబాబుకు కేక్ కట్ చేసి అభిషేకం చేసిన హిజ్రాలు.. ఎందుకో తెలుసా?

ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుకు హిజ్రాలు పాలాభిషేకం చేశారు. ఎపి మంత్రిమండలి హిజ్రాలకు 1500 రూపాయల పెన్షన్‌తో పాటు ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులను మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. చంద్రబాబునాయుడు తీసుకున్న నిర్ణయంపై హిజ్రాలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎపిల

ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుకు హిజ్రాలు పాలాభిషేకం చేశారు. ఎపి మంత్రిమండలి హిజ్రాలకు 1500 రూపాయల పెన్షన్‌తో పాటు ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులను మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. చంద్రబాబునాయుడు తీసుకున్న నిర్ణయంపై హిజ్రాలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎపిలోని అన్ని జిల్లాల్లో హిజ్రాలు సంబరాల్లో మునిగితేలారు. తిరుపతిలోని దామినేడు వద్ద హిజ్రాలు చంద్రబాబు నాయుడు ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు.
 
కేక్ కట్ చేసి పంచుకున్నారు. ఒకరినొకరు రంగులు పూసుకుని సంబరాల్లో మునిగిపోయారు. చంద్రబాబు నాయుడు మాకు దేవుడంటున్నారు హిజ్రాలు. వెయ్యిరూపాయలు మాత్రమే పెన్షన్ కోరితే చంద్రబాబు నాయుడు ఏకంగా 1500 రూపాయలు పెన్షన్ ఇస్తున్నట్లు ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు. మంత్రిమండలిలో నిర్ణయం తీసుకున్న విధంగా ప్రతిపాదనే కాకుండా ఆచరణలో కూడా చంద్రబాబునాయుడు పెట్టాలంటున్నారు హిజ్రాలు.