12 ఏళ్ల మైనర్ అబ్బాయే కారణం.. 18 ఏళ్ల అమ్మాయికి పాపాయి పుట్టింది..
18 ఏళ్ల అమ్మాయి 12 ఏళ్ల మైనర్ అబ్బాయి కారణంగా గర్భం దాల్చింది. రెండు రోజుల క్రితం ఆ అమ్మాయి పాపాయికి జన్మనిచ్చింది. ఈ ఘటన కోరళలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కేరళలోని కొచ్చి కలమసెరిలో రెండు నెల
18 ఏళ్ల అమ్మాయి 12 ఏళ్ల మైనర్ అబ్బాయి కారణంగా గర్భం దాల్చింది. రెండు రోజుల క్రితం ఆ అమ్మాయి పాపాయికి జన్మనిచ్చింది. ఈ ఘటన కోరళలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కేరళలోని కొచ్చి కలమసెరిలో రెండు నెలల క్రితం 18 ఏళ్లు పూర్తయిన ఓ అమ్మాయి స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆస్పత్రికి పురిటినొప్పులతో వచ్చింది.
కడుపు నొప్పి ఎక్కువగా ఉందంటూ రోదిస్తూ వైద్యుడితో చెప్పగా మొదట అతను మైనర్‌గా ఉన్న ఆ అమ్మాయికి ప్రసవం చేసేందుకు నిరాకరించారు. ఆస్పత్రి యాజమాన్యం చైల్డ్‌లైన్ కేంద్రానికి సమాచారం అందించగా వారు ఆస్పత్రికి వచ్చి దగ్గరుండి అమ్మాయికి డెలివరీ చేశారు.
మూడు రోజుల క్రితం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. అయితే అసలు పెళ్లి కాకుండానే.. మైనర్‌గా ఉన్న ఈ అమ్మాయి గర్భం దాల్చడానికి కారణాలేంటని.. ఆస్పత్రి వర్గాలు, చైల్డ్ లైన్ ప్రతినిధులు ఆరా తీయగా 12 ఏళ్ల అబ్బాయే ఇందుకు కారణమని తేలింది. ఈ ఘటనపై బాలుడిపై బాల నేరస్తుడి చట్టం కింద కేసు నమోదు చేశామని స్థానిక పోలీసులు తెలిపారు.