బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 22 అక్టోబరు 2021 (09:54 IST)

ప్రియుడితో అక్క రసపట్టులో ఉండగా చూసిన తమ్ముడు... ఆ తర్వాత...

ప్రేమించిన యువకుడితో అక్క ఏకాంతంగా రసపట్టులో వుండగా తమ్ముడు కళ్లారా చూశాడు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్తాడన్న భయంతో వణికిపోయిన అక్క... తన ప్రియుడితో కలిసి తమ్ముడిని హత్య చేసింది. ఈ దారుణం మహారాష్ట్రలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నాగ్‌పూర్‌లోని విద్యానగర్, దుధ్‌మానా అనే గ్రామానికి చెందిన 16 యేళ్ల  యువతి అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడితో ప్రేమాయణం కొనసాగిస్తూ వస్తోంది. ఇటీవల ఇంట్లో కుటుంబసభ్యులు లేకపోవడంతో తన ప్రియుడిని ఇంటికి పిలిపించి, శారీరకంగా కలుసుకుంది.
 
ఇంట్లో ఎవరూ లేకపోవడంతో వారిద్దరూ హద్దులుదాటి ప్రవర్తించారు. ఈ క్రమంలో ఉన్నట్టుండి 11 యేళ్ల తమ్ముడు ఇంటికి వచ్చాడు. తన అక్క ఓ యువకుడితో శృంగారంలో పాల్గొనివుండటాన్ని కళ్లారా చూశాడు. 
 
అంతే.. ఒక్కసారి షాక్ తిన్న ఆ యువతి.. తమ వ్యవహారం బయటపడుతుందేమోనని ఆందోళనకుగురైంది. తమ బండారాన్ని తమ్ముడు ఎలాగైన తల్లిదండ్రులకు చెబుతాడని, తమ్ముడిని అంతమొందిస్తే తప్ప విషయం బయటకు రాదని చాలా దారుణంగా ఆలోచించింది. 
 
తన ప్రియుడితో కలిసి తమ్ముడిని అతి దారుణంగా గొంతు పిసికి హత్య చేసింది. కొడుకు మృతిపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా అసలు విషయం వెలుగు చూసింది. దీంతో యువతిని, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.