మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 16 ఏప్రియల్ 2021 (17:58 IST)

కరోనా సెకండ్ వేవ్.. 14 రోజుల చిన్నారి బలి

కరోనా వైరస్ విజృంభిస్తోంది. సెకండ్ వేవ్ కావడంతో ఏ లక్షణాలు లేకున్నా వైరస్ అటాక్ అవుతోంది. తాజాగా గుజరాత్‌లో ఓ పసికందు మరణం విషాదం నిపింది. రోజుల పసిగుడ్డు కూడా కరోనా కాటుకు బలైపోయింది.
 
గుజరాత్ సూరత్‌కి చెందిన ఓ మహిళ ఏప్రిల్ 1వ తేదీన బిడ్డకు జన్మనిచ్చింది. అప్పటికే ఆమెకు కరోనా సోకింది. దీంతో పుట్టిన బిడ్డకు కూడా రక్కసి కాటేసింది. బాలింతను మరో దవాఖానకు తరలించారు.

బిడ్డను ఇంటెన్సివ్ యూనిట్‌లో ఉంచి చికిత్స అందజేశారు. పరిస్థితి విషమించడంతో రెమ్ డెసివర్ వ్యాక్సిన్ కూడా ఇచ్చారు. అయినా ఫలితం లేకపోయింది. దీంతో చిన్నారిని వెంటిలేటర్‌పై ఉంచి వైద్యం అందజేశారు.
 
చిన్నారికి మాజీ మేయర్ సూరత్ జగదీశ్ పటేల్ ప్లాస్మా కూడా దానం చేశారు. సూరత్ ఇటీవల కరోనా సోకి.. కోలుకున్న సంగతి తెలిసిందే. ప్లాస్మా దానం చేసినా ఫలితం లేకపోయింది.

ఆ చిన్నారి కరోనాతో గెలవలేక తనువు చాలించింది. ఇటు గుజరాత్‌లో కూడా కరోనా కేసులు ఎక్కువగా వస్తున్నాయి. గురువారం సూరత్‌లో 1551 కరోనా కేసులు నమోదయ్యాయి. 26 మంది వైరస్‌తో చనిపోయారు.