ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వి
Last Modified: శనివారం, 26 సెప్టెంబరు 2020 (17:21 IST)

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల కిరాతకం, 16 మంది గ్రామస్తులు హత్య

కరోనా సమయంలో అందరూ మహమ్మారిపై దృష్టి సారించిన సమయంలో మావోయిస్టులు మాత్రం తమ కార్యకలాపాలను తీవ్రతరం చేశారు. వారి కదలికలు పెరిగిన నేపథ్యంలో వారి కోసం ప్రత్యేక సాయుధ బలగాలు, పోలీసులు కూంబింగ్ ముమ్మరం చేసారు. వీరి కోసం అడవులను జల్లెడ పడుతున్నారు.
 
మరోవైపు చత్తీస్ గడ్ బీజాపూర్ జిల్లా గంగలూర్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు దారుణానికి ఒడిగట్టారు. కుర్చేలి గ్రామానికి చెందిన 16 మంది గ్రామస్తులను హత్య చేశారు. ఇటీవలే 25 మంది గ్రామస్తులను మావోయిస్టులు అపహరించారు.
 
ఆ తర్వాత ప్రజా కోర్టు నిర్వహించి నలుగురి గొంతు కోసి హతమార్చారు. అనంతరం ఐదుగురిని విడుదల చేశారు. తమ ఆధీనంలో ఉంచుకున్న 16 మందిని  ఈ రోజు హత్య చేసినట్లు తెలుస్తోంది. ఈ వార్తతో బాధిత కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.