ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 28 జులై 2021 (03:50 IST)

మూడేళ్లలో 17,675 మంది రైతు ఆత్మహత్యలు

గత మూడేళ్లలో దేశవ్యాపితంగా 17,675 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోగా, ఆంధ్రప్రదేశ్‌లో 1,368 మంది రైతులు బలవన్మరణాల పాలయ్యారని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ మంగళవారం లోక్‌సభకు తెలిపారు. 
 
ఎన్‌సిఆర్‌బి వెబ్‌సైట్‌లో 2019 వరకు మాత్రమే అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రైతుల ఆత్మహత్యలకు కారణాలు మాత్రం ఆయన వెల్లడించలేదు.

కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మాదక ద్రవ్యాలకు బానిసలవడం, వివాహేతర సంబంధ సమస్యలు, ప్రేమ వ్యవహారాలు, దివాలా తీయటం, రుణాలు, పరీక్షల్లో ఫెయిల్‌, నిరుద్యోగం, ఉద్యోగ సంబంధ సమస్యలు, ఆస్తి తగాదాలు తదితర కారణాలతో రైతులతో సహా పలువురు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు.

దేశవ్యాప్తంగా 2017లో 5,955, 2018లో 5,763, 2019లో 5,957 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. ఇందులో అత్యధికంగా మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోనే సంభవించాయని అన్నారు.

మహారాష్ట్రలో 7,345 మంది, కర్ణాటకలో 3,853 మంది, ఆంధ్రప్రదేశ్‌లో 1,368 మంది, తెలంగాణలో 2,237 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.