1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 27 జులై 2021 (18:46 IST)

బాస్... నా భర్తను చంపేయ్, మనిద్దరం ఎంజాయ్ చేద్దాం

తను పనిచేసే కంపెనీలోని బాస్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్నది ఉద్యోగిని. అతడితో స్వేచ్ఛగా విహరించాలంటే భర్త అడ్డుగా వున్నాడని భావించింది. అతడి అడ్డు తొలగిస్తే ఇక హ్యాపీగా అతడితో చెట్టాపట్టాలేసుకుని తిరిగేయవచ్చు అనుకుంది. అనుకున్నదే తడవుగా విషయాన్ని బాస్ కి చెప్పేసింది. తన భర్తను చంపేయాలని కోరింది. ఐతే లక్కీగా బాస్ ప్లాన్ బెడిసికొట్టడంతో నిందితురాలి భర్త ప్రాణాలతో బయటపడ్డాడు.
 
పూర్తి వివరాలు చూస్తే... కర్నాటకలోని దొడ్డబళ్లాపురం నెలమంగల తాలూకా అరిశినకుంట నివాసి గిరీష్, చైత్ర భార్యాభర్తలు. చైత్ర ఓ లారీ షోరూంలో విధులు నిర్వర్తిస్తోంది. ఈ క్రమంలో ఆ షోరూం యజమాని కల్లేశ్ జైన్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. దాంతో వారిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరగడం మొదలుపెట్టారు.
 
 ఐతే తమను తన భర్త గమనిస్తాడేమోనని భయపడిన వివాహిత భర్త అడ్డు తొలగించాలని కల్లేశ్‌ను కోరింది. దీనితో అతడు నలుగురు మనుషులను ఏర్పాటు చేసి చైత్ర భర్తను చంపేయాలని రూ. 10 లక్షలు సుపారీ ఇచ్చాడు. కానీ హత్య చేసే క్రమంలో గిరీష్ తప్పించుకున్నాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు తమదైన శైలిలో విచారించారు. దీనితో అసలు నిందితురాలు కట్టుకున్న భార్య అని తేలింది. హత్యాయత్నం చేసిన ఐదుగురితో పాటు గిరీష్ భార్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.