గురువారం, 4 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 2 జులై 2024 (17:23 IST)

ఉత్తరప్రదేశ్‌‌, హత్రాస్‌లో తొక్కిసలాట.. 27మంది మృతి.. మహిళలే ఎక్కువ

Stampede
Stampede
ఉత్తరప్రదేశ్‌‌, హత్రాస్‌లోని రతీభాన్‌పూర్‌లో మంగళవారం జరిగిన తొక్కిసలాటలో 27 మంది భక్తులు మరణించారు. అలాగే 15 మంది మహిళలు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. హత్రాస్ జిల్లాలోని రతీభాన్‌పూర్ గ్రామంలో శివుడి ఉత్సవాలు జరిగాయి. ఈ ఉత్సవాలకు భారీగా భక్తులు పోటెత్తారు. ఆ క్రమంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 27 మంది భక్తులు మృతి చెందగా, వారిలో 23 మంది మహిళలు, ముగ్గురు చిన్నారులతోపాటు ఒక పురుషుడు ఉన్నారు. 
 
అలాగే క్షతగాత్రులను ఎటాహ్ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. మరోవైపు ఈ తొక్కిసలాట దుర్ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆరా తీశారు. సంఘటన స్థలానికి చేరుకుని.. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను ఈ సందర్భంగా ఆయన ఆదేశించారు.
 
మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఘటనపై విచారణకు కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇందులో భాగంగా ఏర్పాటైన ప్యానెల్‌కు అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఆగ్రా), అలీగఢ్ కమీషనర్ నేతృత్వం వహిస్తారు.

హత్రాస్‌లో భోలే బాబా సత్సంగ్ కార్యక్రమంలో ఒక్కసారిగా భక్తులు ఎగబడటంతో తొక్కిసలాట జరిగిందని.. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం వున్నట్లు పోలీసులు తెలిపారు.